మరో వివాదంలో చిక్కుకున్న స్టార్ హీరో, మధ్య వేలు చూపించి ఏం చేశాడంటే ?
రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ సహా 17 మంది నిందితులు ఒక్కొక్కరు ఒక్కో జైలులో ఉన్నారు. బెంగళూరు పరప్ప అగ్రహార జైలులో నిబంధనలు ఉల్లంఘించినందుకు హీరో దర్శన్ ను బళ్లారి జైలుకు తరలించారు. బళ్లారి జైలులో నటుడు దర్శన్ మౌనంగా ఉన్నప్పటికీ లోపల అతను కుమిలిపోతున్నాడని వెలుగు చూసింది. అయితే హీరో దర్శన్ మీడియాపై మండిపడుతున్నాడని తెలిసింది.
హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి, సోదరుడు దినకర్, ఆయన న్యాయవాదులు బళ్లారి జైలుకు చేరుకున్నారు. ఈ సమయంలో నిందితుడు దర్శన్‌ను పోలీసులు సందర్శకుల గదికి పిలిచారు. ఈసారి ఈ వార్తలను కవర్ చెయ్యడానికి అక్కడికి చేరుకున్న మీడియాను చూసిన హీరో దర్శన్ సహనం కోల్పోయి ఆయన మధ్యవేలు మీడియాకు చూపించాడని కన్నడ మీడియా వార్తలు ప్రసారం చేసింది. హీరో దర్శన్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారని కన్నడ మీడియా తెలిపింది.

జైలు బయట ఉన్న మీడియాను చూసిన దర్శన్ మరింత రెచ్చిపోయాడని ఆరోపణలు ఉన్నాయి. కానీ పోలీసుల మధ్యలో ఉన్నందుకే హీరో దర్శన్ అతని మధ్య వేలును మీడియాకు చూపించాడని కన్నడ మీడియా తెలిపింది. అంతేకాదు హీరో దర్శన్ లోలోపల నవ్వుతున్నాడని తెలిసింది.
జైల్లో ఉన్న హీరో దర్శన్ ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యుల ముందు పశ్చాత్తాపంతో మాట్లాడినట్లు కన్నడ మీడియా తెలిపింది. కానీ హత్య చేసి జైలుకు వెళ్లినందుకు దర్శన్ పశ్చాత్తాపం ఆయన ముఖంలోనే కాదు, ఆయన చర్యలలోనూ కనిపించడం లేదని కన్నడకు చెందిన కొన్ని మీడియా సంస్థలు అంటున్నాయి.
హత్య కేసులో జైలుకు వెళ్లినా దర్శన్ లో మాత్రం అహంకారం తగ్గలేదని కన్నడ మీడియాకు చెందిన కొన్ని సంస్థలు అంటున్నాయి. దర్శన్ అభిమానులు మాత్రం మా హీరో త్వరగా బయటకు రావాలని ఎదురు చూస్తున్నారు. పోలీసులు
చార్జిషీటు సమర్పించిన తర్వాత దర్శన్ బెయిల్ కోసం ఎదురుచూస్తున్నాడు. హీరో దర్శన్ విడుదల కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. హీరో దర్శన్ విడుదలకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియపై చర్చ జరుగుతోంది. బెయిల్ వస్తుందని భావిస్తున్న దర్శన్ మాత్రం జైలు నుంచి బయటకు రావాలని ఎదురు చూస్తున్నాడు.












Click it and Unblock the Notifications