కాంతార హీరోయిన్‌తో అక్రమ సంబంధం..కోర్టుకెక్కిన స్టార్ హీరో భార్య
కన్నడ స్టార్ ఫ్యామిలీ అయిన రాజ్ కుమర్ మనవడు , నటుడు యువరాజ్ కుమార్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యారు. కన్నడ ఇండస్ట్రీలో రాజ్ కుమార్ ఫ్యామిలీకి మంచి పేరుంది. ఆయనకు ముగ్గురు కొడుకులు. శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్. అయితే పునీత్ రాజ్ కుమార్ రెండేళ్ల క్రితమే గుండెపోటుతో మరణించారు. ఇక రెండో కుమారుడు అయిన రాఘవేంద్ర రాజ్ కుమార్ కొడుకే ఈ యువరాజ్ కుమార్. తన భార్య నుంచి విడాకులు కావాలని కోర్టుకు ఎక్కాడు. 2019లో శ్రీదేవి అనే అమ్మాయిని యువరాజ్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
అయితే ఇటీవల వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకోవాలని భావించారు. అయితే వీరిద్దరు కూడా ఒకరిపై మరొకరు అక్రమ సంబంధ ఆరోపణలు చేసుకున్నారు. తన భార్యకు మరొకరితో సంబంధం ఉందని యువరాజ్ కుమార్ ఆరోపించారు. ఓ నటితో యువరాజ్ కుమార్‌కు ఎఫైర్ ఉందని తన క్లైంట్ ఆరోపిస్తుందని ఆయన తరుఫు న్యాయవ్యాది తెలిపారు. దీనిపై స్పందించిన యువరాజు భార్య శ్రీదేవి తనపై చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలని ఆమె తెలిపారు. నా భర్త ఓ నటితో ఎఫైర్ పెట్టుకున్నారని..కుటుంబ పరువు కోసం చాలా ఓపిక పట్టానని.. తప్పకుండా నిజం గెలుస్తుందని ఆమె తెలిపారు. అంతేకాకుండా ఆమె కాంతార హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త యువ రాజ్ కుమార్ కు కాంతార సినిమాలో నటించిన సప్తమి గౌడతో సంబంధం ఉందంటూ శ్రీదేవి ఆరోపణలు చేసింది. తనకు ఆ హీరోయిన్ తో సంబంధం ఉండబట్టే.. తనను వదిలించుకోవాలని చూస్తున్నట్లు ఆరోపణలు చేసింది.

మరోవైపు ఈ ఆరోపణలు, విమర్శలపై కాంతార హీరోయిన్ సప్తమి గౌడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీదేవి చేసిన ఆరోపణలను ఆమె ఖండించింది. అలాగే శ్రీదేవి చేసిన ఆరోపణలపై సివిల్ కోర్టును ఆశ్రయించింది. యువ రాజ్ కుమార్ కేసులో తనకు సంబంధం లేకపోయినా.. తన పేరును ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సప్తమి గౌడ పరువుకు భంగం వాటిల్లే వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే శ్రీదేవి నోటీసులు కూడా జారీ చేశారు. ఇదిలా ఉంటే.. శ్రీదేవి మాత్రం తమ కాపురంలో గొడవలకు సప్తమి గౌడ కారణమంటూ ఆరోపిస్తోంది. ప్రస్తుతం వీరి విడాకుల వ్యవహారం కన్నడ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications