"జూమ్ చేసి మా బాడీ పార్ట్స్ ను తీయోద్దు"
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోతుంది. ఓ చిన్న సంఘటన జరిగినా అది సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం అవుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు తమకు సంబంధించిన ఏ చిన్న విశేషం అయినా నెట్టింట పోస్టు చేస్తున్నారు. అయితే ట్రోలింగ్ కూడా సెలబ్రిటీలపైనే అధికంగా జరుగుతూ ఉంటుంది. ఇక తాజాగా ఓ హీరోయిన్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
హీరోయిన్లను అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు తీయడంపై 'కాంతార' నటి సప్తమి గౌడ తాజాగా ఫైర్ అయ్యారు. పబ్లిక్ ప్లేస్ ల్లో, ఇతర బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనే మహిళా కళాకారులను అభ్యంతరకర యాంగిల్స్ లో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని నటి సప్తమి గౌడ మండిపడ్డారు. ఈ మేరకు హీరోయిన్ల శరీరాన్ని జూమ్ చేసి ఫొటోలు తీయడం.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇకపై ఇలాంటి పనులు మానుకోవాలని, క్రమశిక్షణ పాటించాలని సప్తమి గౌడ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సప్తమి గౌడ తన ఇన్ స్టా గ్రామ్ పోస్టులో ఈ విధంగా తెలిపారు. "ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనే మహిళా కళాకారుల వీడియోలు, ఫోటోలను అసభ్యకరమైన కోణాల నుండి షూట్ చేయడం.. అనవసరంగా మా శరీర భాగాలను జూమ్ చేయడం, ప్రసారం చేయడం వంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నాయి. అయితే ఇలాంటి చర్య అసభ్యకరమైనది.. అలాగే అవమానకరమైనది. ఇది పూర్తిగా మా గౌరవాన్ని ఉల్లంఘించడమే అవుతుంది" అని అన్నారు.

సప్తమి గౌడతోపాటుగా కన్నడ హీరోయిన్లు ఆషిక రంగనాథ్, రుక్మిణి వసంత్ లు కూడా తాజాగా ఈ పోస్టులు పెట్టారు. అవి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇక కాంతారా సినిమాలో సప్తమి గౌడ, రుక్మిణి వసంత్ లు నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. ఇప్పటికే కాంతార నుంచి పార్ట్ 1 రాగా.. పార్ట్ 2 కూడా ఉందని ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించింది.












Click it and Unblock the Notifications