4 ఏళ్లుగా ఓటీటీని రఫ్ఫాడిస్తున్న మహేశ్ బాబు మూవీ ఏదో తెలుసా..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మోస్ట్ సెక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. 2020 లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. పాజిటివ్ టాక్ తో మూవీ దూసుకెళ్లింది. ముఖ్యంగా అనిల్ మార్క్ కామెడీ, మహేశ్ యాక్టింగ్, సాంగ్స్ ఇలా అన్నీ కుదిరి మూవీని బ్లాక్ బస్టర్ చేశాయి. రూ. 75 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.214 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. అదే సమయంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ అల వైకుంఠ పురంలో సినిమా కూడా రిలీజైన విషయం తెలిసిందే.

ఐదేళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ మూవీ మాత్రం ఓటీటీలో దూసుకుపోతుంది. అనేక మంది మూవీని ఓటీటీ వేదికగా చూస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో దూసుకుపోతుంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. మహేశ్ బాబు, రష్మిక మందన్న, విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ వంటి అద్భుతమైన నటులు నటించారు. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మహేశ్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Sarileru Neekevvaru s OTT Triumph Mahesh Babu s Film Runs Strong for 4 Years

ఇక ఆగస్టు 9న మహేశ్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కోసం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కీలక అప్డేట్ ఇచ్చారు. SSMB29 మూవీ నుంచి మహేశ్ బాబు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో మహేశ్ మెడ వరకు మాత్రమే కనిపిస్తోంది. మెడలో రుద్రాక్ష లాకెట్ వేసుకున్నారు. చుట్టూ రక్తంతో లుక్ ఆసక్తిగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా నుంచి పూర్తి అప్డేట్ నవంబరులో ఇస్తామని రాజమౌళి తెలిపారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+