పవిత్రాలోకేష్‌పై నరేష్ బోల్డ్ కామెంట్స్

సీనియర్ నటుడు, ఒకప్పటి కథానాయకుడు అయిన నరేష్ గురించి, తాజాగా ఆయన సహజీవనం చేస్తున్న పవిత్రా లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక.. మూడు రాష్ట్రాల్లో కరోనా తర్వాత అంతగా పాపులరైన విషయం ఏదైనా ఉందా? అంటే అది నరేష్-పవిత్రా లోకేష్ ప్రేమ, పెళ్లి వ్యవహారం. మూడు రాష్టాల్లో వీరి ప్రేమ అత్యంత సంచలనాన్ని కలిగించింది. మూడు పెళ్లిళ్లయినప్పటికీ అవేవీ నిలవకపోవడంతో ప్రస్తుతం మూడో భార్యతో విడాకులిప్పించాలంటూ నరేష్ కోరారు.

ఇంటికే పరిమితమయ్యా
కోర్టులో విషయం తేలిన తర్వాత అధికారికంగా పెళ్లి చేసుకోవాలనే యోచనలో వీరిద్దరూ ఉన్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ పలు విషయాలను వివరించారు. అమ్మ విజయనిర్మల, కృష్ణ.. ఇద్దరూ మరణించిన తర్వాత పవిత్రా లోకేష్ తనకు అండగా నిలబడి ధైర్యాన్నిచ్చిందని చెప్పారు. పవిత్ర తన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత తన జీవనశైలి మొత్తం పూర్తిగా మారిపోయిందని, ఉదయం కార్యాలయానికి వెళ్లడం, షూటింగ్ లకు వెళ్లడం, సాయంత్రం ఇంటికి రావడంతోపాటు కొంచెంసేపు తిని సరదాగా కబుర్లు చెప్పుకుంటామని నరేష్ చెప్పారు. పార్టీలకు వెళ్లడంలేదని, కేవలం ఇంటికే పరిమితమయ్యానన్నారు.

senior actor naresh comments on pavitra lokesh

తనకు అన్నీ పవిత్రే
పవిత్రా లోకేష్ తనకు ఓ అమ్మగా, కూతురుగా, స్నేహితురాలిగా, గైడ్ గా, శ్రేయోభిలాషిగా నిలిచి తన జీవితానికి మద్దతిచ్చిందన్నారు. ఆమెలోనే తాను అన్నీ చూసుకుంటున్నానని, పవిత్ర తన పక్కన ఉంటే మరొకరిని చూడాల్సిన అవసరం లేదన్నారు. ఆమెలోనే తనకు అందరూ కనిపిస్తున్నారన్నారు. ప్రస్తుతం పవిత్ర గురించి నరేష్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. గతంలో వీరిద్దరూ మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటించారు. ఇందులో తాము ఎలా ఇబ్బందులు పడ్డామో, ఎలా ప్రేమలో పడ్డామో, చివరకు ఎలా కలిసిపోయామనే విషయాలను చూపించారు. ఎటువంటి పరిస్థితులు ఎదురవడంవల్ల తామిద్దరూ కలవాల్సి వచ్చింది అనే విషయాన్ని సినిమాలో వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+