అది నా వీక్ నెస్.. రోజూ ఆ పని చేయాల్సిందే అంటున్న నటి
ప్రముఖ సీనియర్ నటి ఆమని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఈ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'జంబలకిడిపంబ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే ప్రేక్షకులను మెప్పించి, ఆ తర్వాత మిస్టర్ పెళ్లాం, మావిచిగురు, శుభలగ్నం, హలో బ్రదర్, అల్లరి పోలీస్ వంటి చిత్రాల్లో అద్భుత పాత్రలు పోషించి స్టార్ హీరొయిన్ గా ఎదిగారు. కెరీర్ పీక్ లో ఉండగానే ఆమె వివాహం చేసుకుని కొంతకాలం ఇండస్ట్రీకి విరామం ఇచ్చారు.
ఇక మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమని.. ప్రస్తుతం ఇప్పుడు సినిమాల్లో తల్లి పాత్రలు చేయడమే కాకుండా బుల్లితెర సీరియల్స్, రియాలిటీ షోలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ భాషల్లో అనేక హిట్ సినిమాలు చేసిన ఆమె రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అందులో తన వీక్ నెస్ గురించి ఓపెన్ అయిన ఆమని.. రోజూ ఖచ్చితంగా ఆ పని చేయాల్సిందే అంటూ సీక్రెట్ రివీల్ చేశారు.

ఆమని ఏం చెప్పారంటే..?
ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకే లేస్తానని.. నిద్రలేచిన వెంటనే స్నానం చేసి పూజ చేయడం మొదటి పని అని చెప్పుకొచ్చారు. పూజ చేయకుండా ఎక్కడికీ వెళ్లనని.. ఒకవేళ పూజ చేయకపోతే ఆ రోజంతా తన మనసు కలవరం చెందినట్టే ఉంటుందని చెప్పారు. లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదవడం, ఆ తర్వాత యోగా చేయడం తన డైలీ రొటీన్ అని వివరించారు.
ఇక మరోవైపు ప్రస్తుతం ఆమని 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' అనే బుల్లితెర సీరియల్‌లో నటిస్తున్నారు. ఇందులో ఆమె పాత్రకు మంచి ఆదరణ లభిస్తోంది. అలానే పలు చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు టీవీ షోలు, సీరియల్స్, ఈవెంట్లతో నిత్యం బిజీగా ఉన్నా కూడా.. ప్రతి ఉదయం పూజ చేయడం చాలా మంచి విషయమని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications