బాలకృష్ణపై బాంబు పేల్చిన స్టార్ హీరోయిన్
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా దూసుకుపోతున్నారు. వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించి బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో వరుసగా మూడు విజయాలు సాధించారు. బాబీ చిత్రం తర్వాత మరోసారి బోయపాటితో జతకట్టనున్నారు. ఆ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా తెలుగు పరిశ్రమకు చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ రచనా బెనర్జీ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలయ్య సెట్స్ లో చాలా కోపంగా ఉండేవారని, అసలు ఏ తప్పు జరిగినా సహించేవారు కాదని చెప్పింది. మరోసారి తిరిగి తెలుగు సినిమాల్లో నటించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించింది. అయితే మంచి కథ దొరకాలని చెప్పింది. ఈ జనరేషన్ లో అల్లు అర్జున్, రామ్ చరణ్ తనకు ఇష్టమైన హీరోలని చెప్పింది. నేను ప్రేమిస్తున్నాను సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన రచన చిరంజీవి సరసన బావగారు బాగున్నారా, బాలయ్య సరసన సుల్తాన్ సినిమాల్లో నటించింది. అభిషేకం, పెద్ద మనుషులు, అంతా మనమంచికే లాంటి సినిమాల్లో నటించి తన నటనతో మెప్పించింది.

అప్పట్లో తెలుగు స్టార్ హీరోలందరితో జతకట్టిన ఈ అమ్మడు తర్వాత బెంగాలీ బుల్లితెరపై మెరిసింది. ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగు పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ నేను ప్రేమిస్తున్నాను సినిమాలో అవకాశం కల్పించారని చెప్పింది. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో మంచి ఆఫర్లు వస్తున్నాయని, రెండు సంవత్సరాల క్రితం కూడా ఒక ఆఫర్ వచ్చిందని, అయితే నిర్మాత, దర్శకుడు అప్రోచ్ అయిన విధానం తనకు నచ్చలేదన్నారు. అలాగే స్క్రిప్ట్ కూడా బాగోలేదన్నారు.












Click it and Unblock the Notifications