అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన మెగా హీరో
మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కు పడటంలేదని కొన్నాళ్ల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నిజమయ్యేలా కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. ఇటీవలే వెల్లడైన ఏపీ ఎన్నికల ఫలితాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించడంతోపాటు జనసేన పోటీచేసిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లోను పార్టీని గెలిపించారు. దేశవ్యాప్తంగా ఇది సంచలనం రేకెత్తించింది. ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మెగా ఫ్యామిలీలో ఓ సంఘటన చోటుచేసుకుంది.
మండిపడ్డ మెగా అభిమానులు
పిఠాపురం నుంచి పోటీచేస్తున్న పవన్ కల్యాణ్ ఆశలు, ఆకాంక్షలు నిజమవ్వాలంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసిన తర్వాతరోజే నంద్యాల నుంచి పోటీచేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి నేరుగా మద్దతు తెలియజేశారు. చిన మామయ్య పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లకుండా బన్నీ నిర్ల్యంగా వ్యవహరించాడని వపర్ స్టార్ అభిమానులు మండిపడ్డారు. ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులకు, మెగా అభిమానులకు సోషల్ మీడియాలో యుద్ధం నడించింది.

విడిపోయిన మెగా కుటుంబం
తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (సాయిదుర్గాతేజ్) ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ (ట్వట్టర్) నుంచి బన్నీని అన్ ఫాలో చేశాడు. అల్లు కుటుంబానికి, కొణిదెల కుటుంబానికి గొడవలు ఉండటంవల్లే సాయిదుర్గాతేజ్ అన్ ఫాలో చేశాడని, చిరంజీవి ఇంట్లో జరిగిన పవన్ కల్యాణ్ విజయోత్సవ వేడుకలకు కూడా బన్నీ హాజరుకాలేదని, రెండు కుటుంబాల మధ్య విడదీయలేని స్థితికి విభేదాలు చేరాయంటున్నారు. అందుకే అల్లు అర్జున్ రాలేదని తెలుస్తోంది. రామ్ చరణ్, బన్నీ మధ్య కూడా గొడవలున్నాయని, కొన్ని కొన్ని సంఘటనలు బయటకు రాలేదని తెలుగు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మెగా కుటుంబం కాస్తా కొణిదెల కుటుంబంగా, అల్లు కుటుంబంగా విడిపోయిందని అభిమానులు అంటున్నారు. ఈ రెండు కుటుంబాలు కలిసిపోవాలని వారు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications