షారుక్ ఖాన్, అట్లీపై నయనతార అసంతృప్తి?
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ జవాన్ సంచలన విజయం దిశగా పయనిస్తోంది. ఈ సినిమా కలెక్షన్లు కూడా లాంగ్ రన్ లో రూ.వెయ్యి కోట్లకు పైగా వసూలు చేస్తాయంటున్నారు. మొదటిరోజు వసూళ్లే రూ.120కోట్లున్నాయి. అలాగే పళ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు అన్నట్లుగా ఈ చిత్రం విషయంలోను అలాగే జరుగుతోంది. ప్రధానంగా హీరోయిన్ నయనతార పరిస్థితి ఇలాగే ఉందంటున్నారు.
జవాన్ చిత్రంతో ఆమె బాలీవుడ్ లోను అడుగు పెట్టారు. పాన్ ఇండియా హీరోయిన్ గా మారారు. నటిగా రెండు దశాబ్దాల నుంచి వెలుగొందుతున్న నయనతార 75 చిత్రాల మైలురాయిని పూర్తిచేసుకున్నారు. నయనతార గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. జవాన్ చిత్రంతో తన పాత్రకు ప్రాముఖ్యత ఇవ్వలేదని, దర్శకుడు అట్లీ, హీరో షారుక్ ఖాన్ పై అసంతృప్తిగా ఉన్నారనేది ఆ వార్త సారాంశం.

అయితే జవాన్ విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తోంది. జవాన్ లో నయనతారకు మంచి ప్రాధాన్యత దక్కింది. ఆమెకు యాక్షన్ సన్నివేశాలు కూడా చోటుచేసుకున్నాయి. మరో విషయం ఏమిటంటే.. షారుక్ ఖాన్ అంటే నయనతారకు పిచ్చి అభిమానం, అట్లీ దర్శకత్వం వహించిన తొలిచిత్రంలో నయనతార హీరోయిన్. తర్వాత బిగిల్ చిత్రంలో విజయ్ సరసన కూడా నటించింది. జవాన్ చిత్రం సక్సెస్ ను సెలబ్రేట్ చేయడానికి తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి ముంబయి వెళ్లారు. ఈ జంటను ముంబై విమానాశ్రయంలో ఫొటోగ్రాపర్లు తమ కెమెరాల్లో బంధించారు. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. దీన్నిబట్టి నయనతార అసంతృప్తిగా ఉందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేటతెల్లమవుతోంది.












Click it and Unblock the Notifications