ఓటీటీలోకి బుర్రపాడు తెలుగు మూవీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..

మిస్టరీ థ్రిల్లర్స్, సస్పెన్స్ ఫుల్ మూవీస్ అంటే ప్రేక్షకులు ఆసక్తికరంగా చూస్తారు. ఇటీవలి కాలంలో రొటీన్ స్టోరీస్ కంటే కంటెంట్ ఉన్న సినిమాలే జనాదరణ పొందుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తున్నాయి. ఆ తర్వాత ఓటీటీల్లోనూ అదరగొడుతున్నాయి. అయితే ఇటీవల తెలుగులో రిలీజ్ అయిన మిస్టరీ థ్రిల్లర్ శంబాల మూవీ ఓటీటీలోకి రానుంది.

టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ తాజాగా నటించిన మిస్టికల్ డివోషనల్ థ్రిల్లర్ 'శంబాల' మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రొటీన్ కథాంశానికి భిన్నంగా ఈ మూవీని తెరకెక్కించడంలో మూవీ డైరెక్టర్ యుగంధర్ ముని సక్సెస్ అయ్యాడు. గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ మూవీ రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.

అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో ఇది స్ట్రీమింగ్ కానుంది. జనవరి 22 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. ఇక ఆహా గోల్డ్ సబ్‌ స్క్రైబర్లకు జనవరి 21 నుంచే ఎర్లీ యాక్సెస్ ఉంటుంది. ఈ మేరకు 'అపోహలు సజీవంగా మారే, విధి గర్జించే ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెట్టండి. ఆది సాయికుమార్ శంబాల జనవరి 22న ఆహాలో ప్రీమియర్ అవుతుంది. ఆహా గోల్డ్ యూజర్స్ కు 24 గంటల ముందే యాక్సెస్' అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

Shambala Streaming Soon Unlock the Mystery on January 22

ఇక ఈ మూవీలో ఆది సాయి కుమార్ తోపాటు అర్చన అయ్యర్, స్వాసిక విజయన్, మధు నందన్, ఇంద్రనీల్, రవివర్మ, మీసాల లక్ష్మణ్ లాంటి వాళ్లు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని యగంధర్ ముని డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో ప్రేక్షకుడికి వెన్నులో వణుకు పుట్టించే సీన్స్, ఉత్కంఠభరితమైన ప్రీ- ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్‌ లు సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తాయి. క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. హార్రర్, మిస్టికల్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్లు ఈ సినిమాను ఆహా వీడియో ఓటీటీలో వీక్షించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+