యుద్ధం పేరిట పాకిస్తాన్ ప్రజలను చంపడం సిగ్గు చేటు ..స్టార్ హీరోయిన్ సంచలన పోస్ట్
పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి తర్వాత ఇండియా , పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది భారత్ ఆర్మీ. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు.అయితే ఓ హీరోయిన్ ఈ ఘటనపై వివాదాస్పద పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ పెట్టిన హీరోయిన్ మరెవరో కాదు..మలయాళ నటి అమీనా నిజం. టెలివిజన్ రియాలిటీ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన అమీనా నిజం ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. తాజాగా ఈ భామ ఇండియా, పాక్ యుద్ధంపై తనదైన శైలిలో రియాక్ట్ అయింది.
"చాలా ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకనప్పుడు , దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నప్పుడు, మా దేశం హత్యను ఒక పరిష్కారంగా ఎంచుకున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. యుద్ధం శాంతిని తీసుకురాదని లేదా చంపడం వల్ల న్యాయం జరగదని గుర్తుంచుకోండి. నేను దానిని సమర్థించను. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని భావించే ప్రజలు తప్పుదోవ పట్టించారు. మనం ఒక యుద్ధంలోకి దిగుతున్నాము మరియు నష్టం కేవలం పౌరులకే ఉంటుంది. నేను నా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే భారతీయురాలిని, అహం దెబ్బతిన్నప్పుడు మాత్రమే మాట్లాడే వ్యక్తిని కాదు" అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.













Click it and Unblock the Notifications