Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్ "చీకటిలో".. అక్కినేని కోడలు హిట్ కొట్టడం పక్కా !

అక్కినేని కోడలు, స్టార్ బ్యూటీ "శోభితా ధూళిపాళ" తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ, నటనకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా తనదైన నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను కూడా చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. వెండితెరతో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై కూడా తన సత్తా చాటుతూ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.

పెళ్లి తర్వాత కొంచెం బ్రేక్..

యువసామ్రాట్ నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత శోభితా వెండితెరపై పెద్దగా కనిపించలేదు. అయితే ఈ గ్యాప్‌లో ఆమె వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టి, బలమైన కథలతో కూడిన పాత్రలను ఎంచుకుంటూ ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు పెళ్లి తర్వాత ఆమె నుంచి రాబోతున్న తొలి సినిమా కావడం వల్ల 'చీకటిలో'పై ఆసక్తి మరింత పెరిగింది. అక్కినేని కోడలిగా ఆమె నటించిన మొదటి విడుదల కావడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

shobhitha-dhulipalla-cheekatilo-movie-ready-for-release-in-amazon-prime

'చీకటిలో'.. పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్

కిర్రాక్ పార్టీ, తిమ్మరుసు ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. సంగీతాన్ని శ్రీచరణ్ పాకాల అందించగా.. సినిమాటోగ్రఫీని మల్లికార్జున్ నిర్వహించారు. శోభితాతో పాటు విశ్వదేవ్ రాచకొండ, ఈషా చావ్లా.. ఆమని, ఝాన్సీ, చైతన్య విశాలాక్షి, చైతన్య కృష్ణ కీలక పాత్రల్లో నటించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందినఈ చిత్రంలో శోభితా 'సంధ్య' అనే ట్రూ క్రైమ్ పాడ్‌కాస్టర్ పాత్రలో కనిపించనున్నారు.

కాగా సంధ్య వద్ద పనిచేసే ఇంటర్న్ అనుమానాస్పదంగా మరణించడంతో, ఆ కేసును ఛేదించేందుకు ఆమె తన పాడ్‌కాస్ట్‌ను ఆయుధంగా మార్చుకుంటుంది. ఈ దర్యాప్తు క్రమంలో గతంలో హైదరాబాద్‌ను వణికించిన ఓ సీరియల్ కిల్లర్‌కు సంబంధించిన షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తాయి. కిల్లర్‌ను పట్టుకునే ప్రయత్నంలో సంధ్య ఎదుర్కొనే ప్రమాదాలు, మానసిక ఒత్తిళ్లు కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తున్నాయి. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, ట్రూ క్రైమ్ కంటెంట్‌పై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి వంటి అంశాలను 'చీకటిలో' చాలా రియలిస్టిక్‌గా చూపిస్తుందని చిత్రబృందం చెబుతోంది.

నేరాలపై సమాజంలో మారుతున్న దృక్పథం, మీడియా ప్రభావం, నిజానిజాల అన్వేషణ వంటి అంశాలు ఈ కథకు బలంగా నిలుస్తాయి. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది కొత్త అనుభూతిని అందించనుందని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఓటీటీలో ఈ సినిమాకు బలమైన ఓపెనింగ్ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. థియేటర్ల విడుదల లేకుండానే నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తున్న 'చీకటిలో' జనవరి 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.

అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్..

ఈ సినిమాతో పాటు శోభితా ధూళిపాళ పా. రంజిత్ దర్శకత్వంలో ఓ తమిళ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇందులో ఆర్య విలన్ పాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+