ప్రభాస్ అభిమానులకు షాక్.. కల్కి సినిమా టికెట్ ధరలు పెంపు..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా మరో నాలుగురోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, సినిమా రీలీజ్‌కు ముందే ప్రభాస్ అభిమానులకు షాకింగ్ న్యూస్ అందింది. కల్కి సినిమా టిక్కెట్ ధరలను పెంచేసారు. ఇప్పుడు కల్కి సినిమా ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌తో పాటు ట్రైలర్‌లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ షోలు వేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ అనుమతినిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జితేందర్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
జూన్ 27 నుంచి జూలై 4 వరకు మొత్తం ఎనిమిది రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇటీవల టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కారు కల్కి సినిమా టికెట్ పై గరిష్టంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ లో రూ.100 వరకు పెంచుకోవచ్చని వివరించింది. వీటితోపాటు జూన్ 27న ఉదయం 5.30 గంటల షోకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వారం రోజులపాటు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.

పెరిగిన టిక్కెట్ ధరలివే..
పెరిగిన టిక్కెట్ రేట్‌లను బట్టి చూస్తే.. బెనిఫిట్ షోల రేట్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.377 ఉండగా, మల్టీప్లెక్స్‌లలో రూ.495 గా నిర్ణయించారు. బెనిఫిట్ షో తర్వాత రెగ్యులర్ షోల రేట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.265 ఉండగా.. మల్టీప్లెక్స్‌లలో రూ. 413 ఉండనుంది. వీటితోపాటు ఆన్ లైన్ లో బుకింగ్, త్రీడీ గ్లాస్ ఛార్జీలు అదనంగా ఉండనున్నాయి. దీనిని బట్టి చూస్తే ఒక్కో టికెట్ ధర రూ.500కి మించి ఉంటుంది. ఇదిలా ఉండగా, తెలంగాణతో పాటు ఏపీలోనూ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది..












Click it and Unblock the Notifications