సింగర్ మంగ్లీ యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్
సింగర్ మంగ్లీకి సంబంధించిన ఓ వార్త సోమవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద మంగ్లీ కారు యాక్సిడెంట్‌కు గురైందని..ఆమె కండిషన్ సీరియస్‌గా ఉందంటూ వార్తలు వెలిశాయి. ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పలు వెబ్‌సైట్స్ ప్రచారం చేశాయి. అయితే తాజాగా దీనిపై సింగర్ మంగ్లీ స్పందించారు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.
ప్రమాదంపై ఓ నోట్‌ను విడుదల చేస్తూ..'ప్రియమైన అందరికీ, నేను సురక్షితంగా ఉన్నాను. బాగున్నాను కూడా. అది కొన్ని రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్. అది కూడా చాలా చిన్నదే. రూమర్లను నమ్మకండి.. స్ప్రెడ్ చేయకండి. మీ ప్రేమకు ధన్యవాదాలు' అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది. ఈ ఘటన జరిగి కూడా రెండు రోజులు కావస్తోంది. అయితే ఇప్పుడు దానిపై వార్త వైరల్ కావడంతో మంగ్లీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

రెండు రోజుల క్రితం జరిగిన అతి చిన్న ప్రమాదమని మంగ్లీ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలను నమ్మి ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని తన అభిమానులను కోరింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్మాత్మిక మహోత్సవానికి హాజరైన మంగ్లీ.. తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ జరిగిందని సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మండలం తొండుపల్లి వంతెన వద్ద డీసీఎం వెనుక నుండి వచ్చి.. సింగర్ మంగ్లీ కారును ఢీ కొట్టిందని వారు తెలిపారు. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఇదిలా ఉంటే గతంలో కూడా మంగ్లీ కారు పలు ప్రమాదాలకు గురైంది.












Click it and Unblock the Notifications