నోరు జారిన ప్రదీప్ రంగనాథన్.. ప్రభాస్ మూవీ టైటిల్ లీక్ చేశాడుగా..
ప్రదీప్ రంగనాథన్.. చేసింది తక్కువ సినిమాలు అయినా తమిళంతోపాటు టాలీవుడ్ లోనూ ఫుల్ క్రేజ్ సాధించాడు. లవ్ టుడే, డ్రాగన్ వంటి చిత్రాలతో వరుసగా రెండు సార్లు రూ. 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్న ప్రదీప్.. ఇప్పుడు డ్యూడ్ చిత్రంతో ముందుకొస్తున్నాడు. ఈ మూవీ ఈ నెల 17న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, పాటలు యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో మూవీపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. హిట్ టాక్ వచ్చినా సూపర్ హిట్ చేసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు.
అయితే డ్యూడ్ మూవీ ప్రొమోషన్లలో భాగంగా అనేక మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్రదీప్ రంగనాథన్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సడెన్ గా నోరు జారారు ప్రదీప్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తావన వచ్చినప్పుడు డార్లింగ్ గురించి చెబుతూ నోరు జారాడు. ప్రభాస్ తదుపరి చిత్రం మూవీ టైటిల్ ను లీక్ చేశాడు. ప్రభాస్- హను రాఘవపూడి కాంబోలో వస్తున్న సినిమా పేరు ఫౌజీ అని చెప్పేశాడు. అయితే ఇప్పటివరకూ ఈ మూవీ టైటిల్ ఫౌజీ అనే సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. కానీ మూవీ టీమ్ ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ క్రమంలో ప్రదీప్ రంగనాథన్ ప్రభాస్ మూవీ పేరు ఫౌజీ అని చెప్పడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం నోటి దూల అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే ఇదే ఇంటర్వ్యూలో ప్రదీప్ మాట్లాడుతూ.. ఫౌజీ చిత్రం సెట్ కు తాను వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. "ఫౌజీ సెట్ లో కొన్ని సీన్స్ చూశాను. ఆ సీన్స్ షాక్ అయ్యేలా ఉన్నాయి. అద్భుతంగా వచ్చాయి. ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది" అంటూ యంగ్ హీరో చెప్పుకొచ్చాడు. ప్రదీప్ రంగనాథన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక ప్రదీప్ డ్యూడ్ మూవీకి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. ప్రభాస్ ఫౌజీ చిత్రానికి కూడా వీళ్లే నిర్మాతలు కావడం విశేషం.

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో 'ఫౌజీ'ఒకటి. ఈ మూవీలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. వార్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామా లవ్ స్టోరీగా ఈ మూవీ రానున్నట్లు సమాచారం. 1940ల కాలం నేపథ్యంలో సాగే చిత్రంగా.. చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న ఫిక్షనల్ కథాంశంగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ మూవీలో హీరోయిన్ గా ఇన్ స్టా ఫేమస్ అయిన ఇమాన్విని హీరోయిన్ గా తీసుకున్నారు.
-
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications