పెళ్లిపై శోభిత ధూళిపాళ షాకింగ్ నిర్ణయం..నయనతార బాటలోనే పయనం
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం సింపుల్‌గా జరిగిన సంగతి తెలిసిందే.సమంత, నాగ చైతన్య ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. సమంత ఒంటిరిగా ఉండగా, నాగ చైతన్య మాత్రం విడాకుల తర్వాత శోభిత ధూళిపాళతో నాగ చైతన్య సైలెంట్‌గా డేటింగ్ చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆమెను వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు.
అతి కొద్దిమంది సమక్షంలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది. ఈక్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించి కీలక ఘట్టం మొదలైంది.నాగ చైతన్య -శోభిత ధూళిపాళల పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. దీనిలో భాగంగానే శోభిత ధూళిపాళ నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను శోభిత ధూళిపాళ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో శోభిత ధూళిపాళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా పాల్గొన్నారు.

త్వరలోనే వీరు పెళ్లి డేట్ ఫిక్స్ కానుంది. అయితే పెళ్లికి ముందు శోభిత ధూళిపాళ ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమ పెళ్లిని డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులకు అందించాలని శోభిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శోభిత తీసుకున్న నిర్ణయానికి నాగ చైతన్య కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.దీని స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది, ఇప్పటికే హీరోయిన్ నయనతార తన జీవిత కథను డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించారు. ఇటీవల నయనతార డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇప్పుడు నాగచైతన్య, శోభిత కూడా అదే ఫాలో అవుతుండటం ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications