అల్లు అర్జున్ "పుష్ప 3" స్టోరీ ఇదేనా.. కలెక్షన్స్ ఊచకోత పక్కా !
భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత హాట్ టాపిక్‌గా మారిన పేరు ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్". 'పుష్ప' సిరీస్‌తో ఆయన ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. ముఖ్యంగా 'పుష్ప 2: ది రూల్' బాక్సాఫీస్‌ను ఊపేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. భారత సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ ఘనవిజయంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్టార్ దిశగా అడుగులు వేశాడని చెప్పవచ్చు.
'పుష్ప'తోనే కథ ముగిసిపోయిందని మొదట భావించినా.. దర్శకుడు సుకుమార్ మాత్రం అభిమానుల అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లారు. 'పుష్ప 2' క్లైమాక్స్‌లోనే 'పుష్ప 3: ది ర్యాంపేజ్' అంటూ అనౌన్స్ చేసి థియేటర్లలోనే కాదు సోషల్ మీడియాలో కూడా సంచలనం సృష్టించారు. ముఖ్యమైన పాత్రలను అసంపూర్తిగా వదిలేయడం, పుష్ప రాజ్ కథ ఇంకా ముగియలేదన్న సంకేతాలు ఇవ్వడంతో మూడో భాగంపై ఆసక్తి అమాంతంగా పెరిగింది.

పుష్ప 3 కథపై స్టోరీలైన్ ఇదేనా..?
ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పుష్ప రాజ్ తన ఎర్రచందనం సామ్రాజ్యాన్ని ఎలా మరింత బలంగా నిలబెట్టుకుంటాడు, శత్రువులు, ద్రోహులపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడన్నదే 'పుష్ప 3' ప్రధాన కథాంశంగా ఉండనుందని టాక్. ఈసారి పుష్ప రాజ్ మరింత రౌద్రంగా, రాజకీయాలు, అంతర్జాతీయ మాఫియాలతో ఢీకొనే స్థాయిలో కథ సాగుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
స్క్రిప్ట్ వర్క్ మొదలైందా?
కాగా దుబాయ్‌లో జరిగిన సైమా 2025 అవార్డ్స్ వేదికగా సుకుమార్ స్వయంగా 'పుష్ప 3 కచ్చితంగా ఉంటుంది' అని కన్ఫమ్ చేశారు. అయితే రిలీజ్ టైమ్‌లైన్ మాత్రం వెల్లడించలేదు. అంతేకాదు, సుకుమార్ టీమ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ ఆఫీస్ తీసుకుని 'పుష్ప: ది ర్యాంపేజ్' స్క్రిప్ట్ వర్క్, కథా చర్చలు ఇప్పటికే మొదలయ్యాయట. బన్నీ, సుక్కు తమ ప్రస్తుత ప్రాజెక్టుల గ్యాప్‌లో ఈ పనులు చేస్తున్నారని సమాచారం. మరోవైపు 'పుష్ప 2' జపాన్‌లో 'పుష్ప కున్రిన్' పేరుతో విడుదలై అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో తన 22వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు పని చేస్తున్నాయి. అలాగే లోకేష్ కనగరాజ్‌తో మరో పాన్ ఇండియా సినిమాకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే 'పుష్ప 3: ది ర్యాంపేజ్' సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. అందుకే ఈ సినిమా షూటింగ్ 2027 వేసవి తర్వాతే ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
-
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..?










Click it and Unblock the Notifications