అందరి ముందే బట్టలు మార్చుకోవాలి - స్టార్ యాంకర్

సెలబ్రిటీల జీవితాలు పైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని ఘటనల గురించి వివరించింది స్పోర్ట్స్ యాంకర్ వింధ్య. స్పోర్ట్స్ ఛానల్స్‌లో తెలుగు ప్రజెంటర్‌గా యాంకర్ వింధ్య విశాఖ అందరికీ పరిచయమే. ముఖ్యంగా ఐపీఎల్ వచ్చిందంటే ఈ పాప సందడి మాములుగా ఉండదు.

బుల్లితెరపై యాంకర్ వింధ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, ఆడియో వేడుకలకు హోస్ట్ చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ పలు ఆసక్తికర అంశాలను అభిమానులతో పంచుకుంది. తొలుత ఫ్యాషన్ రంగంలోకి కెరీర్ సాగించాలని అడుగుపెట్టానని..అయితే ఊహించని విధంగా స్పోర్ట్స్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చానని యాంకర్ వింధ్య చెప్పుకొచ్చింది. కెరీర్ స్టార్టింగ్‌లో తనకు ఎదురైన కొన్ని ఘటనల గురించి ఈ ఇంటర్య్వూలో వివరించింది.

sports anchor vindhya shocking comments modeling

ఓ ఫ్యాషన్ షోకు తాను వెళ్లానని..అక్కడ అమ్మాయిలను ట్రీట్ చేసిన విధానం చూసి షాక్ అయ్యానని తెలిపింది. అక్కడ వాతవరణం చూసి ఈ రంగం సెట్ కాదని అనుకున్నాను. ఆ ఫ్యాషన్‌కు వచ్చిన అమ్మాయిలు బట్టలు మార్చుకోవడానికి సరైన గదులు కూడా లేవు. స్టేజ్ వెనక్కి వెళ్లి అక్కడే అందరి ముందు బట్టలు మార్చుకోవాల్సిన దుస్థితి. ఇది చూసిన నేను షాక్ అయ్యాను.

ఆ వెంటనే డిసైడ్ అయ్యాను.. ఈ రంగం తనకు సెట్ కాదని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నానని వింధ్య తెలిపింది. ఆ ఒక్క ఫ్యాషన్ షోతోనే ఈ రంగానికి గుడ్ బై చెప్పానని యాంకర్ వింధ్య తెలిపింది. గోపాల గోపాల, ముకుందా వంటి సినిమాల్లో నటించాలని ఆఫర్లు వచ్చాయని ఈ హాట్ యాంకర్ తెలిపింది. సినిమా ఇండస్ట్రీపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతోనే ఈ సినిమాలను రిజెక్ట్ చేశానని ఈ అమ్మడు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+