ముగ్గురు పిల్లలకు తల్లి.. డాక్టర్ అయిన కిస్సిక్ బ్యూటీ!
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. కేవలం వెండితెరపై నటిగానే కాకుండా నిజజీవితంలో వైద్యురాలిగా తన కలను సాకారం చేసుకున్నారు. నటిగా ఎంతో బిజీగా ఉంటూనే తన వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేశారు. బుధవారం జరిగిన స్నాతకోత్సవంలో శ్రీలీల తన మెడికల్ డిగ్రీని అందుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
షూటింగ్స్ మధ్యలోనే చదువుకుని..
కేవలం 24 ఏళ్ల వయస్సులోనే నటి శ్రీలీల అటు సినిమాలను, ఇటు చదువును బ్యాలెన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. గ్రాడ్యుయేషన్ గౌను ధరించి వేదికపై వెళ్లి డిగ్రీ పట్టా అందుకుంటున్నప్పుడు శ్రీలీల ముఖంలో కనిపించిన చిరునవ్వు అభిమానులను ఆకట్టుకుంటోంది. గత తొమ్మిదేళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నా.. డాక్టర్ కావాలనే తన లక్ష్యాన్ని శ్రీలీల ఏమాత్రం విస్మరించలేదు.

ముగ్గురు ఆడపిల్లలకు తల్లిగా.. శ్రీలీల సేవాగుణం
శ్రీలీల గురించి చాలామందికి తెలియని మరో గొప్ప విషయం ఏమిటంటే.. ఆమె ముగ్గురు దివ్యాంగులైన ఆడపిల్లలను దత్తత తీసుకున్నారు. 2022లో గురు, శోభిత అనే ఇద్దరు పిల్లలను.. ఆ తర్వాత మరో చిన్నారిని ఆమె దత్తత తీసుకున్నారు. వారు ఒక ఆశ్రమంలో ఉంటున్నారని.. తాను తరచుగా వారిని సందర్శిస్తుంటానని శ్రీలీల గతంలో వెల్లడించారు. తన మొదటి సినిమా 'కిస్' సమయంలో దర్శకుడు ఆశ్రమానికి తీసుకెళ్లినప్పుడు ఆ పిల్లలతో ఏర్పడిన బంధం తనను తల్లిని చేసిందని ఆమె ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు.
#SreeLeela has officially graduated, completing her medical degree ❤️
— Siddarth Srinivas (@sidhuwrites) February 11, 2026
Acting + academics - win win! pic.twitter.com/sisosEPRTZ
బాలీవుడ్ ఎంట్రీ.. చేతి నిండా సినిమాలు
వృత్తిపరంగా చూస్తే, శ్రీలీల త్వరలోనే కార్తీక్ ఆర్యన్ సరసన అనురాగ్ బసు దర్శకత్వంలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ సరసన నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మార్చి 26, 2026న విడుదల కానుంది. వీటితో పాటు ధనుష్ నటిస్తున్న D55 చిత్రంలో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీలీల ప్రముఖ నటిగా కోట్ల మందిని అలరిస్తూనే వైద్యురాలిగా పట్టా పొందడం విశేషం. ఫ్యాన్స్ ఆమెను బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
-
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
సముద్రం అడుగున ఉన్న ఈ జంతువుల్లో చేప పిల్ల ఎక్కడుందో కనిపెట్టగలరా ??? -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
సిరాజ్ను చూడగానే తట్టుకోలేకపోయిన ఆశా భోస్లే మనవరాలు! వీడియో -
విజయ్ను భయపెట్టిన అభిమాని.. సైకిల్ ఆపి పరుగో పరుగు! వీడియో











Click it and Unblock the Notifications