శ్రీరెడ్డి సూసైడ్..నా చావుకు వాళ్ళే కారణమంటూ పోస్ట్

నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉందని మొట్ట మొదటిసారి ధైర్యంగా చెప్పిన నటి శ్రీరెడ్డి. సినిమాల్లో ఆఫర్లు ఇస్తామని చెప్పి పలువురు మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారని ఆమె ఆరోపించింది. దీనిపై ఆమె కొన్ని సాక్ష్యాలను కూడా బయటపెట్టడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక తర్వాత శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీని పెంచుకుంది.

తెలుగు ఇండస్ట్రీపై తనదైనశైలిలో విమర్శలు చేస్తూ నిత్యం వివాదాల్లో నిలుస్తోంది. రాజకీయ విమర్శలు చేయడానికి కూడా శ్రీరెడ్డి ఏమాత్రం మొహటపడదనే విషయం అందిరికి తెలిసిందే. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంటుంది. ఆమె ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి మద్దతుగా ఎన్నో వీడియోలు చేశారామె. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ నేతలపై కూడా తన ధిక్కార స్వరం వినిపిస్తోంది. నాకు వైసీపీ వాళ్లు ఏనాడు మద్దతిచ్చింది లేదని ఆవేదన వ్యక్తం చేసింది. వైసీపీ వాళ్లు నన్ను తన పార్టీ మనిషిగా గుర్తించడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

Sri Reddy suicide post goes viral

వైసీపీలో కొందరి నాయకుల వల్ల పార్టీ ఓడిపోయిందని చెప్పి కొందరి నేతలపై విమర్శలు గుప్పించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పవన్ కల్యాణ్‌పై రెచ్చిపోతూ పోస్ట్‌లు పెట్టారామె. దీంతో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిందనే కారణంతో శ్రీరెడ్డిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే శ్రీరెడ్డి తాజాగా తాను సుసైడ్ చేసుకుంటానని చెప్పి షాకిచ్చింది.. సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయని పేర్కొంది.

తాను మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయ్యానని పేర్కొన్న శ్రీరెడ్డి.. ఈ టార్చర్ భరించలేకపోతున్నా. నన్ను ఇక ఆ భద్రకాళీ అమ్మవారే కాపాడాలంటూ వేడుకుంది. నాకు సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనే ఆలోచనలు వస్తున్నాయని తెలిపింది. ఒకవేళ నేను ఆత్మహత్య చేసుకుంటే దానికి మీడియా, టీడీపీ, జనసేన పార్టీలే కారణం అవుతాయని తన పోస్ట్‌లో శ్రీరెడ్డి రాసుకొచ్చింది . ఇంకా ఎన్నిరోజులు బతుకుతానో తెలియదు. వీటన్నింటి నుంచి బయటకు రావడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాను కానీ రాలేకపోతోన్నాను. ఈ పరిస్థితి మీకు సిల్లీగా అనిపించవచ్చు. చాలా మంది నవ్వుకుంటారని కూడా నాకు తెలుసు.. అంటూ శ్రీరెడ్డి చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+