'ఓజీ' లో విలన్ క్యారక్టర్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

పవర్​ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'ఓజీ' ఒకటి. ఇటీవల విడుదలైన హరిహర వీర మల్లు నిరాశ పరచడంతో ఫ్యాన్స్ ఈ సారి ఎలాగైనా తమ హీరో హిట్ కొట్టాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్‌ స్టర్‌ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో పవన్​ ఢీకొట్టే రోల్​ లో బాలీవుడ్​ స్టార్​ ఇమ్రాన్​ హష్మీ చేయనున్న విషయం తెలిసిందే. ఇమ్రాన్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'టైగర్ 3'లో విలన్‌ గా నటిస్తున్నారు. ప్రతి నాయకుడిగా ఆయన రెండో సినిమా 'ఓజీ' కానుండటం విశేషం.

పవర్​ స్టార్ పవన్ కల్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఓజీ. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. ఫస్ట్ హాఫ్ కు సంబంధించిన వర్క్ ఎడిటింగ్ తో సహా పూర్తి అయింది. ఇక ప్రస్తుతం సెకండ్ హాఫ్ కు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ జరుగుతోంది. ఇక ఇటీవల ఈ చిత్రం నుండి విడుదల చేసిన ఫైర్ స్ట్రోమ్ పాట ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఓజీ మూవీలో పవన్ కల్యాణ్ కు అన్న, వదినలుగా కిక్ శ్యామ్, శ్రియా రెడ్డి నటించారు. అయితే నిజానికి ఈ రెండు క్యారెక్టర్స్ కోసం ముందుగా మోహన్ లాల్, టబు ని అనుకున్నారట. కానీ పవన్.. సుజిత్ కి ముందుగానే ఓ విషయం చెప్పాడట. తనకు ఉన్న పొలిటికల్ కమిట్‌మెంట్స్ వల్ల ఎప్పుడైనా సినిమాకి బ్రేక్ పడొచ్చని.. అంత పెద్ద ఆర్టిస్ట్స్ ను సినిమా కోసం తీసుకోవద్దని సూచించారట. ఒకవేళ బ్రేక్ పడితే మళ్లీ డేట్స్ సర్దుబాటు కావడం ఇబ్బంది అవుతుందని అన్నాడట.

Star Hero s Missed Opportunity The Villain Role in Pawan Kalyan s OG

అలాగే పవన్ కల్యాణ్ తండ్రి క్యారక్టర్ ను ప్రకాష్ రాజ్ చేశారు. వాస్తవానికి ఈ క్యారక్టర్ కోసం ముందుగా అమితాబ్ బచ్చన్ ను తీసుకోవాలని అనుకున్నారట. ఇక ఈ చిత్రం లోని మెయిన్ విలన్ క్యారక్టర్ కోసం ముందుగా కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ క్యారక్టర్ ని ఇమ్రాన్ హష్మీ చేశారు. ఇలా పలు కారణాల వల్ల క్యాస్టింగ్ మొత్తం మారిపోయింది. ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25 విడుదలకు సిద్ధం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+