స్టార్ హీరోయిన్ అలియా భట్‌కి టోకరా.. 77 లక్షలు కాజేసిన పీఏ!
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్‌కు భారీ షాక్ తగిలింది. నమ్మిన వాళ్లే నట్టేట ముంచేస్తారు అనే మాటను ఉదహరిస్తూ.. ఈ బ్యూటీకి పర్సనల్ అసిస్టెంట్ టోకరా వేసి లక్షల్లో డబ్బులు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం బాలీవుడ్ లో టాక్ ఆఫ్ డీ టౌన్ గా నడుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అలియా భట్ వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా వేదికా ప్రకాశ్ శెట్టి 2021 నుంచి 2024 వరకు పని చేసింది. ఆ సమయంలో ఆలియా వ్యక్తిగత ఖాతాలతో పాటు ఆమె నిర్మాణ సంస్థ 'ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్' ఆర్థిక వ్యవహారాలను కూడా వేదికానే చూసుకునేదని తెలుస్తోంది. అయితే ఇదే అదనుగా భావించిన వేదికా, 2022 మే నుంచి 2024 ఆగస్టు మధ్య కాలంలో ఈ అవకతవకలకు పాల్పడిందని తెలుస్తోంది.

వేదికా తప్పుడు లెక్కలు చూపిస్తోందని ఆలియా తల్లి, ప్రముఖ నటి-దర్శకురాలు సోనీ రజ్‌దాన్ గుర్తించారు. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 23న జుహు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చీటింగ్, నమ్మకద్రోహం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో వేదికా.. తప్పుడు లెక్కలు, నకిలీ బిల్లులు సృష్టించి ఏకంగా రూ.77 లక్షలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రయాణాలు, మీటింగ్‌లు, ఇతర ఖర్చుల పేరుతో వేదికా నకిలీ బిల్లులను తయారుచేసి, వాటిపై ఆలియా సంతకాలు తీసుకునేదని తెలిపారు.
ఆ బిల్లులను అచ్చం అసలువాటిలా కనిపించేందుకు ప్రొఫెషనల్ టూల్స్ వాడినట్లు తేల్చారు. ఆమోదం పొందిన తర్వాత ఆ డబ్బును తన స్నేహితురాలి ఖాతాకు బదిలీ చేయించి.. అక్కడి నుంచి తిరిగి తన ఖాతాలోకి మళ్లించుకునేదని పోలీసులు తెలిపారు. ఆ మొత్తం డబ్బుల్ని ప్రయాణాలు, మీటింగ్స్, మిగిలిన అరేంజ్‌మెంట్స్ చేయడానికి ఖర్చు చేసినట్లు వివరించారు. మరోవైపు వేదికా ప్రకాశ్ పోలీసుల నుంచి తప్పించుకుని తిరగటం మొదలు పెట్టి తరచుగా ఊర్లు మారుతూ ఉండడం ప్రారంభించింది.

మొదటగా రాజస్థాన్ నుంచి కర్ణాటక వెళ్లి అక్కడి నుంచి పూణేకు వచ్చి, ఆ వెంటనే బెంగళూరు వెళ్లిపోయింది. ఇక వేదికా ఆచూకీని బెంగళూరులో గుర్తించిన జుహు పోలీసులు, అక్కడికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ట్రాన్సిట్ రిమాండ్‌పై ముంబైకి తరలించారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నమ్మకద్రోహానికి పాల్పడిన వేదికాపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ ఘటనతో సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు తమ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications