భర్త కాళ్లు కడిగి.. ఆ నీళ్లే తాగిన స్టార్ హీరోయిన్..!
సోషల్ మీడియా.. చిన్నా లేదు పెద్ద లేదు.. అందరూ ఎడిక్ట్ అయిపోయిన వాళ్లే. పబ్లిక్ లేదు, పర్సనల్ లేదు అన్ని విషయాలను షేర్ చేసేస్తూ అదో లోకంలో బ్రతికేస్తున్నారు. ఇక సెలబ్రిటీల విషయంలో అయితే ఫోకస్ మరీ ఎక్కువ ఉంటుంది అనడంలో సందేహం లేదు. కొంతమంది హీరోయిన్లు అందాలు ఆరబోసి ఫాలోవర్స్ ని పెంచుకుంటుంటే.. మరికొందరు మాత్రం తమ పోస్టుల కారణంగా ట్రోలింగ్ కి గురవుతున్నారు.
ఒడిశా ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరుగాంచిన నటి ఎలినా సమంతరాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 2017లో Abhaya అనే చిత్రంతో అరంగేట్రం చేసిన ఈ నటి, తన డెబ్యూ సినిమాతోనే ఉత్తమ నటిగా ఒడిశా స్టేట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది. గత సంవత్సరం నవంబర్‌లో బాలిలో అనురాగ్ పండా అనే వ్యక్తిని వివాహం చేసుకొని, ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది.

అయితే ఇటీవల జరిగిన సావిత్రి వ్రతం సందర్భంగా ఆమె భర్త పాదాలను కడిగి, ఆశీర్వాదం తీసుకోవడమే కాకుండా... ఆ పాదాల నీటిని తాగడం నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. ఈ దృశ్యాలను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు.
దీంతో ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర అసహనంతో స్పందిస్తున్నారు. "ఇది పబ్లిసిటీ కోసం చేసిన డ్రామా", మహిళలను తక్కువ చేశారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఎలినా మాత్రం ట్రోల్స్‌పై స్పందించకుండానే తన ఫాలోవర్లకు ధన్యవాదాలు చెబుతూ, భర్తతో కలిసి ఉన్న మరిన్ని ఫోటోలు షేర్ చేస్తోంది.












Click it and Unblock the Notifications