సమంత-సిద్ధార్థ్ విడిపోవడంలో కాంట్రవర్సీ ఏమిటి?
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ సమంత గత 10 సంవత్సరాల నుంచి మీడియాలో ఎప్పుడూ హైలెట్ అవుతూనే ఉంది. ప్రతి నాలుగు రోజులకోసారి ఏదో ఒక విషయంమీద తను వార్తల్లో నిలుస్తుంటుంది. గతంలో హీరో సిద్ధార్థ్ తో తో ప్రమాయణం.. తర్వాత శ్రీకాళహస్తి ఆలయంలో రాహు-కేతు పూజ చేయించుకోవడం.. తర్వాత స్టార్ హీరోయిన్ గా మారడం.. తర్వాత నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి.. నాలుగేళ్ల తర్వాత విడాకులు.. తర్వాత మయోసైటిస్, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు.. ఇలా ప్రతి అంశంలో, ప్రతి విషయంలో తరుచుగా మీడియాలో నిలుస్తూనే ఉంది.
పీకల్లోతు ప్రేమలో..
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాతే వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కువగా చేయడంతోపాటు హద్దల్లేకుండా ఎక్స్ పోజింగ్ చేస్తోంది. సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలు షేర్ చేస్తోంది. పుష్ప సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ అయితే సమంతను మరోస్థాయిలో చూపించింది. ఆ పాట చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. తన మాజీ ప్రియుడు సిద్ధార్థ్ తో జబర్దస్త్ సినిమా షూటింగ్ సమయంలో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. వీరిద్దరూ శ్రీకాళహస్తి ఆలయంలో రాహు-కేతు పూజ కూడా చేయించం అప్పట్లో సంచలనంగా మారింది. వీరి ప్రేమ పెళ్లి వరకు వెళుతుందనుకున్నారుకానీ పూర్తి కారణాలు వెల్లడి కాకుండానే సమంత నాగచైతన్యకు దగ్గరైంది.

విడుదలైన కొంత కాలానికే..
అప్పట్లో జబర్దస్త్ సినిమా వివాదాస్పదంగా మారింది. సమంత స్నేహితురాలు నందినీరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. బెల్లంకొండ సురేష్ దీన్ని నిర్మించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత బాలీవుడ్ సినిమా బ్యాండ్ బాజా బరాత్ సినిమాకు కాపీలా తీశారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ సినిమాను దర్శకురాలు నందినీరెడ్డి కాపీ పేస్ట్ చేశారన్నారు. దీనిపై ఆ సినిమా నిర్మాతలు కోర్టుకు వెళ్లడంతో టీవీల్లో, డీవీడీల్లో ప్రసారం చేయకూడదని కోర్టు తీర్పునిచ్చింది. తర్వాత నిర్మాత దీన్ని సెటిల్ చేసుకుంటున్నారు. ఈ సినిమా విడుదలైన కొంతకాలానికే సమంత-సిద్ధార్థ్ విడిపోయారు.












Click it and Unblock the Notifications