ఆ హీరోకు రూ.కోట్లు రాసిచ్చిన స్టార్ హీరోయిన్

తెలుగులో మనకు ఉన్న స్టార్ హీరోల్లో దివంగత శోభన్ బాబు ఒకరు. ఆయన హీరోగానే కాకుండా ఒక ఆర్థిక నిపుణుడిగా పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు. సంపాదించే ప్రతి రూపాయిని భూమిపై పెట్టుబడిగా పెట్టేవారు. ఏ వ్యాపారంలోనైనా రూపాయి పెట్టుబడి పెడితే ఆ రూపాయి రావడానికి అవకాశం ఉంది.. అలాగే పోవడానికి అవకాశం ఉంది.. కానీ భూమిపై పెడితే మాత్రం కచ్చితంగా రూపాయికి రెండు రూపాయిలు వస్తాయి.. నష్టపోవడం అంటూ ఉండదు అనేది శోభన్ బాబు సిద్ధాంతం. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆయన ఈ సూత్రం చెప్పేవారు.

రూ.వేలకోట్లు సంపాదించిన మురళీమోహన్
ఆయన మాటలు విని భూమిపై పెట్టుబడి పెట్టిన మురళీమోహన్ కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించారు. శోభన్ బాబు ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.లక్ష కోట్లపైనే ఉంటుందని అంచనా. 1965లో వచ్చిన మనుషులు మమతలు చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి జయలలిత ప్రవేశించారు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లో ఎంతో పేరు తెచ్చుకున్నారు. శోభన్ బాబుతో జయలలిత సహజీవనం చేసిందని చెబుతారు. వారి ప్రేమకు గుర్తుగా ఓ పాప జన్మించిందని వార్తలు వచ్చేవి.

star heroine wrote thousands of crore rupees for that star hero

పరిశ్రమలో అత్యంత ధనవంతుడు శోభన్ బాబు
ఒక సందర్భంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంజీఆర్ స్విస్ బ్యాంకులో దాచిన రూ.3వేల కోట్లను ప్రేమతో జయలలిత శోభన్ బాబుకు ఇచ్చింది. ఎంజీఆర్ ధరించే టోపీలో స్విస్ బ్యాంకు వివరాలుండేవంటారు. ఇదంతా మనకెందుకులే ఈ డబ్బులు నువ్వు తీసుకో.. నాకు చాలా ఉంది అని శోభన్ బాబుకు ఈ ముద్దుగుమ్మ ఇచ్చేసిందంట. ఆ డబ్బును శోభన్ బాబు భూములపై పెట్టుబడిగాపెట్టారు. ఆ భూముల్లో సగం తాను తీసుకొని మరో సగం జయలలితకు ఇచ్చేశారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు తోటపల్లి మధు చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే శోభన్ బాబు అనే పేరు అందరూ చెబుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+