మైక్ పట్టుకుని థియేటర్ల వద్ద దిల్ రాజు: సినిమా ఎలా ఉందో తెగేసి చెప్పిన ఆడియన్స్
Dil Raju: విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ.. ఫ్యామిలీ స్టార్. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. పరశురామ్ దర్శకుడు. గోపీ సుందర్ సంగీతాన్ని అందించారు. ఈ నెల 5వ తేదీన విడుదల అయిందీ మూవీ. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారీ సినిమాను. పేరుకు తగ్గట్టే ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. బీ, సీ సెంటర్లల్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ- అంచనాలకు మించి కలెక్షన్లను రాబట్టుకుంటోందీ మూవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజే 6.5 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించింది.

ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూలు వచ్చిన విషయం తెలిసిందే. కథ బాగున్నప్పటికీ.. నెరేషన్ ఆ స్థాయిలో లేదని, మూవీ మొత్తం స్లోగా సాగిందంటూ రివ్యూస్ రాశాయి మూవీ వెబ్‌సైట్స్. విజయ్ దేవరకొండ- మృణాల్ ఠాకూర్ జంట ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అంటూ రాసుకొచ్చాయి.
దీనిపై దిల్ రాజు స్వయంగా రంగంలోకి దిగారు. యాంకర్ అవతారం ఎత్తారు. మైక్ పట్టుకుని థియేటర్ల ముందు కనిపించారు. సినిమా చూసి బయటికి వచ్చిన ఆడియన్స్‌ను పలకరించారు. మైక్ పెట్టి- సినిమా ఎలా ఉందంటూ ఆరా తీశారు. గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్ సహా కొన్ని మల్టీ ప్లెక్స్‌లల్లో ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలను సేకరించారు.
ఈ సందర్భంగా ఆడియన్స్ తమ అభిప్రాయాలను దిల్ రాజు ముందే తేల్చి చెప్పారు. సినిమా బాగుందంటూ కితాబిచ్చారు. ఫ్యామిలీ స్టార్ సిినిమాపై నెగెటివ్ రివ్యూలు రావడాన్ని తప్పుపట్టారు. సినిమా ఎంత బాగున్నప్పటికీ నెగెటివ్ రివ్యూలు వాటిని కిల్ చేస్తోన్నాయని, వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications