ముందు తల్లైంది..ఆ తర్వాత పెళ్లైంది..ఇప్పుడు పెంటయ్యింది..!
సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్లు, రూమర్స్ చాలా సాధారణం. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ తరహా వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ప్రస్తుత తరం నటీనటులు చాలామంది ఒకరితో రిలేషన్ షిప్ కొనసాగించి, ఆ తర్వాత మరొకరిని వివాహం చేసుకున్నవారే.
ఆధునికత పేరుతో ఇప్పుడు శృంగార విషయాల గురించి కూడా బహిరంగంగా మాట్లాడటం కనిపిస్తుంది. గతంలో ఇలాంటి విషయాలు రహస్యంగా ఉంచేవారు కానీ, ఇప్పుడు 'మెచ్యూరిటీ' పేరుతో బహిరంగంగానే చర్చించుకుంటారు. ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ పెళ్లికి ముందే తల్లైంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. ఇది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.ఆ హీరోయిన్ మరెవరో కాదు.. స్టైలిష్ట్ జాయ్.

తెలుగు ప్రేక్షకులకు స్టైలిష్ట్ జాయ్ పెద్దగా తెలియకపోవచ్చు కానీ, కోలీవుడ్ అభిమానులకు స్టైలిష్ట్ జాయ్ సుపరిచితురాలే. తాజాగా ఈ భామ కోలీవుడ్ నటుడైనా రంగరాజ్‌ను సైలెంట్‌గా వివాహం చేసుకుంది. రంగరాజ్‌కు గతంలో శృతి అనే అమ్మాయితో వివాహం జరిగింది.వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.భార్య శృతితో విభేదాలు తలెత్తడంతో రంగరాజ్ విడాకులు తీసుకున్నారు.భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత స్టైలిష్ట్ జాయ్‌తో రిలేషన్ మెయిన్‌టైన్ చేశాడు.
ఇటీవలే ఈ జంట వివాహం చేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే..పెళ్లి రోజే స్టైలిష్ట్ జాయ్ తాను ఆరు నెలలతో గర్భవతిని అని ప్రకటించింది. ఇటీవలే భర్తతో వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను సైతం తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకునే సమయంలో స్టైలిష్ట్ జాయ్ ట్విస్ట్ ఇచ్చింది. నా భర్త నేను గర్భం దాల్చిన తర్వాతే పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు తనని పట్టించుకోవడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది స్టైలిష్ట్ జాయ్ .ఇందులో వాస్తవం ఎంతో ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.పెళ్లైన నెల రోజులకే స్టైలిష్ట్ జాయ్ ఇలా చేయడం ఇప్పుడు కోలీవుడ్‌లో సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications