ఆ హీరోయిన్ తో మహేష్ బాబు మాట్లాడడు?
తెలుగు సినీ పరిశ్రమలో నెగెటివ్ కామెంట్స్ తెచ్చుకోని హీరో ఎవరు? అంటే అందరూ ఠక్కున చెప్పే పేరు మహేష్ బాబు. అందరి హీరోలపై ఎంతో కొంత నెగెటివిటీ ఉండితీరుతుంది. కానీ మహేష్ బాబులో మాత్రం అందరూ పాజిటివిటీనే చూస్తారు. సెలెంట్ గా తన పని తాను చేసుకుపోయే ప్రిన్స్ కు కూడా ఓ హీరోయిన్ కోపం తెప్పించింది. మహేష్ బాబుకు కోపం తెప్పించిందంటే అతని ఓపికను ఆమె ఎంత పరీక్షించిందో అర్థం చేసుకోవచ్చు.
ఆ హీరోయిన్ ఎవరో కాదు నయనతార. మహేష్ బాబుతో ఏకంగా మూడు సినిమాల్లో చేసే అవకాశాన్ని వదులుకుంది. మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లే కావడం విశేషం. మహేష్ బాబు - నయనతార కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ వారిద్దరి కాంబినేషన్ ను సెట్ చేయడానికి మాత్రం దర్శకులు చాలా ప్రయత్నించారు.

అయితే అడిగిన ప్రతిసారి నయనతార ఓవర్ యాక్టింగ్ చేసిందని, కండిషన్లు ఎక్కువగా పెట్టిందని, సినిమా ప్రమోషన్లకు రానని, కేవలం షూటింగ్ వరకే పరిమితమవుతానని చెప్పడంతో ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. చిత్రం ఏమిటంటే.. ఏదైనా ఈవెంట్ లో నయనతార ఎదురైనా ఆమెను ఎప్పుడూ పలకరించలేదు. మాట్లాడడు. విషయం ఏదన్నాకానీ వారిద్దరూ ఎందుకు మాట్లాడుకోరో ఎవరికీ తెలియదు.
ప్రస్తుతం ప్రిన్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలందిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కాబోతోంది.












Click it and Unblock the Notifications