ఒక్క సెకనుకు మహేష్ బాబు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమాలు చేయడానికి నిరాసక్తతను ప్రదర్శిస్తున్నప్పటికీ అతని ఇమేజ్, క్రేజ్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో ఉంటుంది. అభిమానులుకానీ, రెమ్యునరేషన్ కానీ, సినిమా వసూలు చేసే కలెక్షన్లుకానీ.. అన్నీ ఇలా హైరేంజ్ లోనే ఉంటాయి. పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ ప్రిన్స్ ను బాగా ఇష్టపడుతుంటారు. మొన్న సంక్రాంతికి గుంటూరు కారం సినిమా విడుదల కాగా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమాకు సిద్ధమవుతున్నాడు.
తెలుగులో ఎక్కువ వాణిజ్య ప్రకటనల్లో కనిపించే నటుడు కూడా మహేష్ బాబే. ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే కు మహేష్ బాబు తన గొంతును అరువిచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల నుంచి ఈ వార్త సోషల్ మీడియాలో వీరంగం చేస్తోంది. తాజాగా ఆ యాడ్ చేసినందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది.

ఉదాహరణకు ఫోన్ పే ద్వారా ఎవరైనా 100 రూపాయలు పంపిస్తే ఇప్పుడే వంద రూపాయలు ఫోన్ పే ద్వారా వచ్చాయి.. హ్యాట్సాఫ్ గురువుగారు అంటూ ఒక వాయిస్ వినపడుతుంది. అయితే అది విన్న తర్వాత మనం ఆశ్చర్యపోతాం. ఎందుకంటే అది మహేష్ బాబుది కాబట్టి. ఐదు సెకండ్ల వాయిస్ కోసం మహేష్ బాబు రూ .5 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే సెకనుకు కోటిరూపాయల చొప్పున ఫోన్ పే సంస్థ చెల్లించింది. ప్రస్తుతం మనకు ఫోన్ పేద్వారా బిగ్ బి అమితాబ్ బచ్చన్ వాయిస్ వింటున్నాం. ఇకనుంచి మహేష్ బాబు వాయిస్ వినబోతున్నాం. కొద్ది సంవత్సరాల నుంచి తెలుగులో స్టార్ హీరోగా చెలామణి అవుతోన్న మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమాద్వారా పాన్ వరల్డ్ హీరోగా మారబోతున్నాడు. దీనికోసం భారతీయ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా మూడు సంవత్సరాల సమయం ఈ సినిమాకు పట్టనుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications