భారీగా పెరిగిన మహేష్‌బాబు ఆస్తుల విలువ
సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా మంత్రముగ్ధులవుతారు. అంతటి అందాన్ని ఈ హీరో కలిగివుంటారు. అయితే అందంతోపాటు అంతకంటే అందమైన మనసు ఈ సూపర్ స్టార్ సొంతం. ప్రతి ఏడాది తన సంపాదనలో రూ.25 కోట్లను చిన్నారుల గుండె ఆపరేషన్లకు కేటాయిస్తుండగా, మరో 30 శాతాన్ని స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తున్నారు. ఏపీలో తన స్వగ్రామం బుర్రిపాలెం, తెలంగాణలో సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకొని వీటిని స్మార్ట్ విలేజెస్ గా తీర్చిదిద్దారు.
జీవన ప్రమాణాలు పెంచుతున్నారు
నాణ్యమైన విద్యుత్తు, అందమైన రోడ్లు, గ్రంథాలయాలు, పాఠశాలలతోపాటు మంచి ఆరోగ్య సదుపాయాలను కల్పించి అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషిచేస్తున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయకుండా ఉంటే ప్రిన్స్ ఆస్తి భారీగా ఉండేది. అయితే ప్రతి ఏడాది కచ్చితంగా తన సంపాదనలో కొంత భాగాన్ని వీటికోసం ఖర్చుచేస్తున్నారు. సినిమాలతోపాటు వ్యాపారపరంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. గచ్చిబౌలిలో ఏడు తెరలు ఉన్న మల్టీప్లెక్స్ (ఏఎంబీ), జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఉన్నాయి.

పద్మాలయ స్టూడియో కాకుండా
సినిమాలతోపాటు వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో వాణిజ్య ప్రకటనలు ఎక్కువగా చేసేది మహేష్ బాబు ఒక్కరే. ప్రతి ప్రకటనకు ఆయన రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇప్పటివరకు ఆయన 51 ప్రకటనలు చేశారు. అలాగే సినిమాకు రూ.80 నుంచి రూ.100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. వీటిని వ్యాపారాల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. పద్మాలయ స్టూడియోతోపాటు హైదరాబాద్ లో రూ.40 కోట్ల విలువచేసే బంగళా ఉంది. ఇటీవలే బెంగళూరులో మరో ఇల్లు కొనుగోలు చేశారు. అన్నీ కలిపితే ప్రస్తుతం మహేష్ బాబు ఆస్తి విలువ రూ.1300 కోట్లుగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ ఆస్తి విలువలో పద్మాలయ స్టూడియోను మినహాయించారు.












Click it and Unblock the Notifications