థియేటర్ల బంద్ లో కొత్త కోణం: అసలు కారకుడు ఆ స్టార్ నిర్మాతే
Dil Raju: ఎగ్జిబిటర్లు ప్రతిపాదించిన థియేటర్ల బంద్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, కమల్ హాసన్- మణిరత్నం కాంబోలోని హైబడ్జెట్ మూవీ థగ్స్ లైఫ్ సినిమాలు విడుదల కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జిబిటర్లు బంద్ కు పిలుపునివ్వడం వివాదాస్పదమైంది.
దీనిపై ఇప్పటికే పవన్ కల్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వడానికి ప్రయత్నిస్తోన్న పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖులు రిటర్న్ గిఫ్ట్ ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. ఎగ్జిబిటర్ల బంద్ వెనుక ఆ నలుగురి హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణకూ ఆదేశించారు.

ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని, సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. పవన్ కల్యాణ్ చేసిన ఈ ప్రకటన టాలీవుడ్ లో ప్రకంపనలను పుట్టించింది. దీనిపై అల్లు అరవింద్, దిల్ రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్లు స్పందించారు కూడా. తమకు సంబంధం లేదనీ వ్యాఖ్యనించారు.
అక్కడితో ఆగలేదు పవన్ కల్యాణ్. థియేటర్ల బంద్ కు పిలుపునిచ్చినట్లుగా ఆరోపణలను ఎదుర్కొంటూ వచ్చిన పార్టీ నాయకుడు అత్తి సత్యనారాయణపై వేటు వేశారు. పార్టీ నుంచి బహిష్కరించారు. తనపై వచ్చిన ఆరోపణలు సత్యమా? అసత్యమా? అని నిరూపించుకునేంత వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అత్తి సత్యనారాయణను ఆదేశించారు.
అలాగే- రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ హోదా నుంచి సైతం ఆయనను తప్పించినట్లు జనసేన అగ్ర నాయకత్వం ప్రకటించింది. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో ఆయన భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు రావడం వల్లే పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని, పార్టీ సభ్యత్వాన్ని సైతం రద్దు చేశామని తెలిపింది.
ఈ పరిణామాలపై అత్తి సత్యనారాయణ స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో తన ప్రమేయం లేదనీ వివరణ ఇచ్చుకున్నారు. సున్నితమైన ఈ వ్యవహారంలో తనను ఇరికించారనీ పేర్కొన్నారు. థియేటర్ల బంద్ తో తనకు ఎటువంటి సంబంధం లేదనీ చెప్పుకొన్నారు. దీని వెనుక గల వ్యక్తులు, కారణాలను బయటపెట్టారు.
జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ కు పిలుపునిచ్చింది.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి అని అత్తి సత్యనారాయణ తెలిపారు. తన తమ్ముడుని కాపాడుకోవాలనే ఉద్దేశంతో దిల్ రాజు తనపై ఈ అభాండం వేశారని, తనను బలి పశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ అంటూ వచ్చిన ప్రకటన వెనుక ఖచ్చితంగా దిల్ రాజు ప్రమేయం ఉందని అత్తి సత్యనారాయణ తేల్చి చెప్పారు. ఈ విషయంలో దిల్ రాజు కమల్ హాసన్‌ను మించి.. ఆస్కార్ రేంజ్‌లో దిల్ రాజు నటించాడని ఎద్దేవా చేశారు. శిరీష్ రెడ్డి పేరు ఎక్కడా బయటికి రాకూడదనే ఉద్దేశంతోనే తన పేరు బయటపెట్టారని అన్నారు.
పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇవ్వడం వల్ల దిల్ రాజు జనసేన పేరు ఎత్తారని అన్నారు. ఈ వ్యవహారంలో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, తాను థియేటర్ల బంద్ అని ఎక్కడా చెప్పలేదని అన్నారు. థియేటర్లను బంద్ పెట్టాలంటూ గత ఏడాది శిరీష్, సురేష్ బాబు, ఏషియన్ సునీల్ సంతకాలు సైతం చేశారని అత్తి సత్యనారాయణ ఆరోపించారు.
అప్పట్లో ఆయా నిర్మాతల సినిమాలు విడుదలకు సిద్ధం కావడం వల్ల బంద్ ను ఎప్పటికప్పుడు దాటవేస్తూ వచ్చారని, ఈ విషయాన్ని బయటికి పొక్కనివ్వలేదని చెప్పారు. హరిహర వీరమల్లు సినిమాను తొక్కేయాలనే దురుద్దేశంతోనే థియేటర్ల బంద్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు.
ఇది బయటపడటం వల్లే ఇప్పుడు భుజాలు తడుముకుంటోన్నారని అత్తి సత్యనారాయణ అన్నారు. పవన్ కళ్యాణ్ తనకు దేవుడితో సమానమని, జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటోన్నానని, అలాంటప్పుడు తన దేవుడి సినిమాను తొక్కేయాలనే ఉద్దేశం తనకు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications