సస్పెన్స్ థ్రిల్లర్ వచ్చేస్తుంది ..అసలు మిస్ అవొద్దు
ఒక సాధారణ కథకు ఊహించని మలుపులు, హార్ట్ బీట్ పెంచే మైండ్ గేమ్‌లు తోడైతే వచ్చే కిక్కే వేరు. సరిగ్గా అలాంటి సీటు అంచున కూర్చోబెట్టే సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరికొత్త చిత్రం 'మిస్సింగ్ మేఘన'. ఫస్ట్ కాపి మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో, వాచస్పతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ సినీ ప్రముఖులు, మీడియా సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది.
ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ విడుదల చేయగా, ఫస్ట్ సింగిల్‌ను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు లాంచ్ చేశారు. ఆర్.ఆర్. ధృవన్ అందించిన స్వరాలు, అలరాజు సాహిత్యం, ప్రముఖ ఛాయాగ్రాహకుడు శామ్ కె. నాయుడు అందించిన విజువల్స్ ఈ థ్రిల్లర్ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చిన్న సినిమాలకు నాణ్యమైన కంటెంట్ ఉన్నప్పుడు మీడియా, పరిశ్రమ మద్దతు చాలా అవసరం. సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు, ఎంతోమంది జీవితాలు. కంటెంట్ ఉన్న 'మిస్సింగ్ మేఘన' చిత్రం సెప్టెంబర్ 18న పెద్ద విజయం సాధించాలని ముఖ్య అతిథిగా పాల్గొన్న దామోదర్ ప్రసాద్ తెలిపారు.

ఒక మంచి కుటుంబ కథకు విభిన్న ట్విస్టులు, సస్పెన్స్ ఎలిమెంట్స్ జోడించామని, కథలో ఉన్న సస్పెన్స్ అండ్ డ్రామా ఎంతగానో ఆకట్టుకుంటాయని కథే ఈ సినిమాకు అసలైన హీరో. అమ్ము అభిరామి, మేము అందరం కలిసి ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ప్రయత్నం చేశామని, కథలోని ఉత్కంఠనే సినిమాను ముందుకు నడిపిస్తుందని, ప్రేక్షకులు థియేటర్లలో సరికొత్త అనుభూతి పొందుతారని చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేశారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్యలతో పాటు గోపరాజు రమణ, కౌశిక్, నళిని వంటి నటీనటుల బలమైన తారగణంతో వస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను సెప్టెంబర్ 18న థియేటర్లలో మిస్ అవ్వకుండా చూడాలని సినిమా యూనిట్ కోరింది.














Click it and Unblock the Notifications
