పాన్ ఇండియా రేంజ్ లో 'తండేల్'.. చైతూకి తొలి 100 కోట్ల మూవీ..!
యువసామ్రాట్, అక్కినేని వారసుడు నాగచైతన్య , బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నటిసున్న లేటెస్ట్ మూవీ తండేల్. సంక్రాంతి సినిమాలు అయిపోవడంతో.. ప్రస్తుతం ఈ మూవీ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అటు సినీ ఇండస్ట్రీతోపాటు మూవీ లవర్స్ లోనూ ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ మూవీతో చైతూ రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరతారని మూవీటీమ్ తోపాటు అందరూ ఆశిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మార్కెట్ తోపాటు అటు పాన్ ఇండియా మార్కెట్ పైనా ఈ మూవీ కన్నేసింది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ మూవీపై ఆసక్తిని పెంచేస్తోంది. మరి తండేల్ మూవీ చైతూను రూ. 100కోట్ల క్లబ్ లోకి చేరుస్తుందా..?
శ్రీకాకుళం టూ పాకిస్థాన్..
ఈ మూవీలో చైతూ ఓ మత్సకారుడిగా నటిస్తున్నారు. ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగనుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్థాన్ వరకూ చేరుకుంటుందని సమాచారం.

డైరెక్టర్ విజన్..
కార్తికేయ 2 చిత్రంతో టాలీవుడ్ తో పాటు హిందీ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు పొందిన డైరెక్టర్ చందూ మొండేటి. 2022లో విడుదలైన కార్తికేయ 2 మూవీ బడ్జెట్ కేవలం 15 కోట్లు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ దాదాపు 115 కోట్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలించింది. ఈ చిత్రం తర్వాత చందూ చేస్తున్న మూవీ తండేల్ కావడంతో.. కార్తికేయ 2 మాదిరిగానే ఈ మూవీ కూడా రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరుతోందని అక్కినేని ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు.
చైతూ- పల్లవి మ్యాజిక్..
నాగచైతన్య, సాయి పల్లవి కలిసి ఇంతకుముందు లవ్ స్టోరీ చిత్రంలో నటించారు. ఈ మూవీని శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. సినిమా యావరేజ్ గా నిలిచినా.. చైతూ, పల్లవి కెమిస్ట్రీ హిట్ అయింది. దీంతో తండేల్ మూవీలోనూ సేమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని మూవీ లవర్స్ భావిస్తున్నారు.
రికార్డ్ స్థాయిలో ఓటీటీ రైట్స్..
ఈ మూవీ అన్ని భాషల డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ. 40 కోట్లకు సొంతం చేసుకుందని సమాచారం. అయితే చైతూ ఇప్పటి వరకు తీసిన సినిమాల ఓటీటీ రైట్స్ కంటే ఇది ఎక్కువ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బన్నీవాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఇప్పటికే రిలీజైన బుజ్జితల్లి, శివశక్తి సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ రాబట్టాయి.
ఆకట్టుకున్న గ్లింప్స్..
గతంలో రిలీజైన గ్లింప్స్ లో నాగ చైతన్య రగ్గ్‌డ్ లుక్‌లో కనిపించగా, సాయి పల్లవి తన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. బోటుపై చేపల వేటకు వెళ్తున్న చైతూ 'దద్దా గుర్తెట్టుకో ఈపాలి యాట గురి తప్పేదెలేదేస్ ఇక రాజులమ్మ జాతరే' అంటూ చెప్పే డైలాగ్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మరి సినిమా రిలీజయ్యాక ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications