దిల్ రాజు భార్య తీన్మార్ డాన్స్ ఇరగదీసిందిగా.. వీడియో వైరల్‌

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు దంపతులు వినాయకుడి నిమజ్జనం వేడుకలో సందడి చేశారు. భక్తులతో కలిసి సరదాగా డాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. సాధారణంగా సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూల్లో చాలా ప్రశాంతంగా ఉండే దిల్ రాజు వినాయకుడి నిమజ్జనంలో మాత్రం ఫుల్ జోష్ లో కనిపించారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సరదాగా ఆడిపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వినాయకుడి నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో దిల్ రాజు భార్య తేజస్విని తీన్ మార్ డాన్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. మాస్ బీట్ కు తగ్గట్లుగా కాళ్లు, చేతులు కదుపుతూ అక్కడ ఉన్నవారిలో జోష్ ను నింపారు. దాంతో అక్కడున్న వారి బంధువులు, కుటుంబ సభ్యులు కూడా దిల్ రాజు దంపతులతో కలిసి చిందేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్ హల్ చల్ చేస్తున్నాయి.

Tejaswini Dil Raju wife energetic dance during the Vinayaka immersion video viral in social media

ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దిల్ రాజు గారు ఈ రేంజ్ మాస్ మోడ్ లో మీరు ఎప్పుడూ కనిపించలేదని కామెంట్స్ పెడుతున్నారు. అలాగే మరికొంతమంది సూపర్ జోడీ అంటూ ప్రశంసిస్తున్నారు. అంతేకాక ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. దిల్ రాజు కార్యాలయంలో జరిగిన విమాయకుడి నిమజ్జనం కార్యక్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక టాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఒకటి. ఇదే బ్యానర్ పై ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. హిట్స్ - ప్లాఫ్స్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో నిర్మాతగా దిల్ రాజు దూసుకుపోతున్నారు.

గతేడాది గేమ్ ఛేంజర్, తమ్ముడు చిత్రాలు దిల్ రాజుకు నష్టాలు మిగిల్చినా.. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి లాభాలను తీసుకొచ్చింది. ఈ ఏడాది ఎల్లమ్మ చిత్రంతో పాటు మాన్ స్టర్ అనే బాలీవుడ్ చిత్రానికి కూడా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక దిల్ రాజు మొదటి భార్య మరణం తర్వాత తేజస్విని ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ప్రస్తుతం ఒక బాబు ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+