సినీ పరిశ్రమ ప్రముఖులతో సీఎం రేవంత్ భేటీ.. !
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నుంచి సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో పలువురు సినీ నిర్మాతలు, దర్శకులతో సమావేశం అయ్యారు. కాగా కార్మికుల సమస్యలను పరిష్కరించినందుకు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమలో పని వాతావరణం సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిన్న నటీనటులు, సాంకేతిక నిపుణులు పరిశ్రమలోకి కొత్తగా రావడానికి నైపుణ్యాలను పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం చెప్పారు.

కార్పస్ ఫండ్ ఏర్పాటు ద్వారా నైపుణ్యాభివృద్ధి కోసం సహకారం అందిస్తామన్నారు. అలానే స్కిల్ యూనివర్సిటీలో సినీ పరిశ్రమకు అవసరమైన ప్రత్యేక కోర్సులు, శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సమావేశానికి హాజరైన ప్రముఖులలో నిర్మాతలు.. అల్లు అరవింద్, డి. సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి కిషోర్, నవీన్ ఎర్నేని, వంశీ, బాపినీడు, డీవీవీ దానయ్య, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీప్రసాద్ ఉన్నారు. అలానే దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల ఉన్నారు.












Click it and Unblock the Notifications