మన హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
తెలుగు, తమిళ పరిశ్రమల్లోని స్టార్ కథానాయికలు హిందీలో కూడా తమ హవాను కొనసాగించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగంగానే నయనతార బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించింది. అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ సరసన నటించి రష్మిక మందన్న ఖాతాలో కూడా బ్లాక్ బస్టర్ పడింది. సిటాడెల్ వెబ్ సిరీస్ తో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సమంత సిద్ధమవుతోంది. అలాగే ఇతర కథానాయికలు కూడా బాలీవుడ్ పై దృష్టిసారించారు.
మార్కెట్ పరిధి పెరుగుతుంది
దీనివల్ల మార్కెట్ పరిధి పెరగడమే కాకుండా రెమ్యునరేషన్ కూడా పాన్ ఇండియా స్థాయిలో వస్తుంది. రెండువిధాలా లాభం ఉండటంతో స్టార్ హీరోయిన్లంతా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటించాలనుకుంటున్నారు. దీనికి తగ్గట్లుగా తెలుగు, తమిళం, కన్నడం నుంచి వస్తున్న సినిమాల్లో 80 శాతం సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్నాయి. హీరోయిన్లకు డిమాండ్ ఎక్కువవుతుండటంతో వీరంతా తమ పారితోషికాన్ని ఊహించనిరీతిలో పెంచేశారు.

సినిమాకు రూ.4 కోట్లు
మయోసైటిస్ వల్ల సినిమాలకు కొంచెం దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం బిజీగా మారే ప్రయత్నం చేస్తోంది. ఖుషి తర్వాత సొంత బ్యానర్ లో ఓ సినిమా చేస్తోంది. చెన్నై స్టోరీస్, సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.4 కోట్లు వసూలు చేస్తోంది. మరో స్టార్ హీరోయిన్ నయనతార హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది.
హీరోలతో సమానంగా నయనతార
జవాన్ చిత్రంలో నటించినందుకు రూ.10 కోట్లు ముక్కుపిండి మరీ వసూలు చేసింది. తర్వాత చేయబోయే సినిమాలకు రూ.12 కోట్లు అడుగుతోంది. రష్మిక ఒక్కో సినిమాను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ వస్తోంది. పుష్ప2లో నటిస్తోంది. సినిమాకు రూ.4 కోట్ల వరకు తీసుకుంటూ నిర్మాతలకు అందుబాటులో ఉండే హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అలాగే నాలుగు పదుల వయసులో కూడా మెరుపు వేగంతో సినిమాలు చేస్తూ తారాపథంలోకి దూసుకుపోతోంది త్రిష. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు తీసుకుంటోంది. తమన్నా రూ.7 కోట్లు, కీర్తిసురేష్ రూ.4 కోట్లు, సాయిపల్లవి రూ.3 కోట్లు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications