ఆ తెలుగు హీరో వేధిస్తున్నాడు..ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి
మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాతో కృతి శెట్టి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఉప్పెన సూపర్ హిట్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది కృతి శెట్టి. తన మొదటి సినిమాతోనే అందర్ని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఓ రెండేళ్లు వరుస సినిమాలతో అదరగొట్టింది. నితిన్, నాగ చైతన్య, రామ్, నాని వంటి యంగ్ స్టార్స్‌తో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
అయితే కృతి శెట్టి నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో ఆమెకు కొద్దిగా అవకాశాలు తగ్గాయి. కృతిశెట్టి తెలుగులో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మనమే చిత్రంలో హీరోయిన్‌గా చేసిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫెయిల్ అయింది. ఇదే సమయంలో నాగ చైతన్యతో నటించిన కస్టడీ సైతం ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. ఇదే సమయంలో శ్రీలీల ఎంట్రీ ఇవ్వడంతో కృతి శెట్టి కాస్తా డల్ అయిందనే చెప్పాలి. కృతి శెట్టికి తమిళ, మళయాళ సినిమాల్లో మాత్ర వరుస ఆఫర్లు వెల్లువెత్తున్నాయి.

ఇదిలా ఉంటే కృతి శెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తనని ఓ తెలుగు హీరో ఇబ్బంది పెడుతున్నారని చెప్పి బిగ్‌బాంగ్ పేల్చింది. స్టార్ హీరో అర్థరాత్రి టైమ్‌లో ఫోన్ చేసి విసిగిస్తున్నారు. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పదేపదే చేస్తున్నాడు. ఇక అతడి నెంబర్ గుర్తుపట్టి లిఫ్ట్ చేయకపోవడం వల్ల వేరే నంబర్స్ నుంచి ఫోన్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు" అని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరో మాత్రం ఆమె బయటపెట్టలేదు.
ఇక యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. యాంకర్ మీరు రిలేషన్‌లో ఉన్నారా అని అడగ్గా అవును అని సమాధానం ఇచ్చింది. దీంతో ఎవరితో అని మరోసారి ప్రశ్నించగా, నేను నా ఫ్రొఫెషన్, నా వర్క్‌తో రిలేషన్‌లో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కృతి శెట్టి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications