ఇండియన్ సినిమాను శాసిస్తోన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..?
హీరోలతో పోలిస్తే హీరోయిన్ల లైఫ్ చాలా తక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. తెర మీద వారి పాత్ర తక్కువే, తెర వెనుక వారు తీసుకునే రెమ్యూనిరేషన్ కూడా హీరోల కంటే తక్కువగానే ఉంటోంది. అయితే ఇటీవల హీరోయిన్లు సైతం తమ గ్రాఫ్‌ను పెంచుకుంటున్నారు. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 18 దాటిపోయింది. ఇప్పటికి వరుస సినిమాలు చేస్తోంది. నయనతార, త్రిష వంటి సీనియర్ హీరోయిన్లు సైతం యంగ్ బ్యూటీస్‌కు గట్టి పోటీనిస్తున్నారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఇండియన్ సినిమా ఇండస్ట్రీనే శాసిస్తోంది.
ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు రష్మిక మందన్న. తెలుగు ఇండస్ట్రీలో రష్మిక క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఛలో సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రష్మిక, ఆ తర్వాత, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ వస్తోంది.తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రష్మిక మందన్నా. ఈ మధ్య శ్రీలీల కాస్తా హడావిడి చేసినప్పటికీ...ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడింది. ఇక పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్దెకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం రష్మిక మందన్నానే టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు.

రష్మిక మందన్నా నటించిన సినిమాలు బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. గతేడాది పుప్ప, సీతరామం, యానిమల్ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. రష్మిక ఉంటే చాలు సినిమా హిట్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇక రష్మిక మందన్నా రాబోవు సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది.బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, విక్కి కౌషల్‌తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. తమిళంలో కూడా రెండు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. దీంతో ఇప్పుడు ఏ భాషలో చూసుకున్న రష్మిక హవానే కనిపిస్తోంది. రష్మిక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్లు దాటిపోయింది. అయినప్పటికీ వరుస సినిమాలను చేస్తూ నేషనల్ క్రష్‌గా మారింది.












Click it and Unblock the Notifications