తెలుగులో హీరోయిన్ల రెమ్యునరేషన్
సినీ పరిశ్రమలో హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారు. తెలుగులో ఎంతమంది ఉన్నారా? అని లెక్కపెడితే వేళ్లమీద లెక్కించేంత సంఖ్యలోనే ఉన్నారు. కానీ వారి పారితోషికం మాత్రం చుక్కల్లో ఉంటుంది. బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో వీరు రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నారు. తెలుగులో ఎవరెవరు? ఎంతెంత? తీసుకుంటున్నారో తెలుసుకుందాం.
నయనతార:
జవాన్ సినిమా విజయవంతమైన తర్వాత తన పారితోషికాన్ని భారీగా పెంచింది. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు తీసుకుంటోంది.

అనుష్క:
సినిమాకు రూ.3కోట్ల పారితోషికం అందుకుంటోంది.
సమంత:
పెళ్లయిన తర్వాత, విడాకులైన తర్వాత కూడా సమంత మంచి ఫామ్ లో ఉంది. ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. సమంత పారితోషికం కింద రూ.3కోట్లు తీసుకుంటోంది.
పూజా హెగ్డే:
వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ భామకు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల మధ్యలో అందుకుంటోంది. ప్రస్తుతం తన రెమ్యునరేషన్ కోటిన్నర రూపాయలు తగ్గించినట్లు తెలుస్తోంది.
రష్మిక :
సినిమాకు రూ.2.25 కోట్లు తీసుకుంటోంది. యానిమల్ సినిమాతోపాటు పుష్ప2 హిట్ అయితే ఆమె రేంజ్ ఇంకా ఇంకా పైకి చేరుతుందని చెప్పవచ్చు.
శ్రీలీల:
తెలుగులో మంచి ఫామ్ లో ఉంది ఎవరంటే శ్రీలీల అని చెప్పవచ్చు. ఆమె దూకుడుకు ఇతర హీరోయిన్లంతా వెనకబడిపోతున్నారు. సినిమాకు రూ.1.50 కోట్లు పారితోషికంగా తీసుకుంటోంది. భగవంత్ కేసరి హిట్టయిన తర్వాత రూ.3 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
నిధి అగర్వాల్ :
ఒక్కో సినిమాకు కోటిరూపాయల చొప్పున తీసుకుంటోంది.
కీర్తి సురేష్:
సినిమాకు రూ.2కోట్ల చొప్పున తీసుకుంటోంది.
కాజల్ అగర్వాల్:
భగవంత్ కేసరి చిత్రం కోసం రూ.2కోట్లు తీసుకుంది.
తమన్నా:
సినిమాకు కోటిరూపాయల చొప్పున తీసుకుంటోంది.
కియారా అద్వానీ:
సినిమాకు రూ.3కోట్ల చొప్పున వసూలు చేస్తోంది.
రాశీ ఖన్నా:
సినిమాకు రూ.60 లక్షల చొప్పున తీసుకుంటోంది.
రకుల్ ప్రీత్ సింగ్:
సినిమాకు రూ.70 లక్షలు తీసుకుంటోంది.
సాయిపల్లవి:
సినిమాకు రూ.1.25 కోట్లు తీసుకుంటోంది. ఆచితూచి సినిమాలు చేస్తుంది.












Click it and Unblock the Notifications