థియేటర్లలో ఏడాదికిపైగా ఆడిన తెలుగు సినిమాలు
తెలుగులో గతంలో అగ్రహీరోలంతా సంవత్సరానికి ఐదు నుంచి ఎనిమిది సినిమాలు చేసేవారు. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటివారు 10 నుంచి 15 సినిమాలు చేసిన రోజులున్నాయి. సూపర్ కృష్ణ ఒకే ఏడాదిలో 18 సినిమాల్లో నటించి విడుదల చేశారు. దీనివల్ల థియేటర్లకు లాభాలుంటాయి. అందులో ఉద్యోగస్తుల నుంచి క్యాంటిన్లు, సైకిల్ స్టాండ్లు లాంటి వ్యాపారాలు చేసేవారంతా కళకళలాడుతుండేవారు. కానీ ప్రస్తుతం మన తెలుగు హీరోలు ఇతరుల సంగతి వదిలేశారు. తాము బాగుంటే చాలనుకుంటున్నారు. మూడు సంవత్సరాలకు ఒక సినిమా, లేదంటే రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తారు. పారితోషికం మాత్రం వందల కోట్లరూపాయల్లో తీసుకుంటారు.
దీనివల్ల థియేటర్లన్నీ కల్యాణ మండపాలయ్యాయి. ఎంతోమంది ఉద్యోగస్తులు నిరుద్యోగులయ్యారు. హీరోలకు మాత్రం అవన్నీ కనపడవు. ఒకప్పుడు థియేటర్లలో సినిమా విడులవుతోంది అంటే ఎడ్ల బండ్లు కట్టుకొని మరీ వచ్చి చూసి వెళ్లేవారు. అటువంటి అద్భుతమైన యోగాలను తెలుగు సినిమా చూసింది. ఆ సమయంలో థియేటర్లలో సినిమాలన్నీ ఏడాది, రెండేళ్లు, 200 రోజులు, శతదినోత్సవాలు జరుపుకునేవి. వీటిని గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీలుగా ఎక్కువగా పిలిచేవారు. థియేటర్లలో అత్యధిక రోజులు తెలుగులో ఆడిన సినిమాలేమున్నాయో చూద్దాం. అందులో బాలయ్యవే ఉన్నాయి.

* కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లెజెండ్ సినిమా 1000 రోజులకుపైగా ఆడింది.
* రాజమౌళి-రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర కర్నూలు జిల్లాలోని విజయలక్ష్మి థియేటర్ లో 1000 రోజులు ప్రదర్శితమైంది.
* మహేష్ బాబు - పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి ఏకంగా 580 రోజులు ఆడింది.
* కోడిరామకృష్ణ దర్శకత్వంలో బాలయ్య నటించిన మంగమ్మగారి మనవడు సినిమా హైదరాబాద్ లోని తారకరామా థియేటర్ లో 556 రోజులు నిరాటంకంగా ప్రదర్శింపబడింది.
* దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమాభిషేకం ఎక్కువ థియేటర్లలో 300 రోజులకు పైగా ఆడింది.
* నందమూరి తారకరామారావు నటించి లవకుశ 1963లో విడుదలై 469 రోజులు ప్రదర్శితమైంది.
* శింబు తండ్రి టి.రాజేందర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమసాగరం 465 రోజులు ఆడింది.












Click it and Unblock the Notifications