చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం అన్న తెలుగు స్టార్ హీరో!
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో నిఖిల్ తన మామ అయిన చీరాల ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్యకు ఓ విజ్ఞప్తి చేశారు. జయచంద్ర అనే నెటిజన్ ట్వీట్ కు స్పందించిన నిఖిల్ సమస్య పరిష్కారమయ్యేలా చూశారు. చీరాల పట్టణంలోని పువ్వాడవారి వీధిలోని పాత సూర్య ఆసుపత్రి ఎదురుగా ఓ అపార్ట్ మెంట్ లో నెటిజన్ నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఉండేవారంతా చెత్తను తీసుకొచ్చి రోడ్డుపై పడేస్తున్నారని, దీనివల్ల ఆ ప్రాంతం మొత్తం దుర్గంధంతో నిండిపోతోందని, దాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని కోరారు.
రీట్వీట్ చేసిన నిఖిల్
చీరాల మున్సిపాలిటీ అధికారులతోపాటు ఆ నెటిజన్ హీరో నిఖిల్ కు కూడా ట్వీట్ చేశారు. నిఖిల్ వెంటనే దీన్ని తన మామ మాలకొండయ్య దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అక్కడ ఉన్న చెత్తను తొలగించారు. తొలగిస్తున్న ఫొటోలను నిఖిల్ ట్వీట్ చేశారు. జయచంద్రా.. మీరు ప్రస్తావించిన సమస్యపరిష్కారమైంది.. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారంటూ రీ ట్వీట్ చేశారు.

Hello Jaya Chandra .. we Took immediate action on this and got it cleared. #Chirala https://t.co/VdVV3E7m9q pic.twitter.com/dDyTyrJa4R
— Nikhil Siddhartha (@actor_Nikhil) June 16, 2024
పార్టీలో చేరలేదని స్పష్టం
చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య కుమారుడితో నిఖిల్ సోదరికి వివాహమైంది. బంధుత్వం ఉండటంతో ఆయన గెలవాలని ఆకాంక్షిస్తూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున చీరాలలో ప్రచారం చేశారు. దానికి ముందు నారా లోకేష్ ను కూడా కలిశారు.
దీంతో హీరో నిఖిల్ టీడీపీలో చేరారంటూ వార్తలు వచ్చాయి. అయితే పార్టీలో చేరలేదంటూ ఆయన పీఆర్ టీమ్ స్పష్టం చేసింది. ఒక్క చీరాల నియోజకవర్గంలోనే ఆయన తన మామ గెలుపు కోసం ప్రచారం చేశారు. ఆ సమయంలో ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును తప్పనిసరిగా గెలిపించాలని ఓటర్లను నిఖిల్ కోరారు.












Click it and Unblock the Notifications