అల్లు అర్జున్‌ను దూరంగా పెడుతున్న తెలుగు స్టార్ హీరోలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ త్వరలోనే విడుదల కాబోతోంది. దీనితర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. తాజాగా బన్నీ తన పుట్టినరోజును 8వ తేదీన జరుపుకున్నారు. అయితే చిత్రం ఏమిటంటే.. తెలుగులో ఉన్న స్టార్ హీరోలెవరూ అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు కూడా తెలియజేయలేదు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిద్దరూ బావా.. బావా.. అంటూ ఎంతో స్నేహంగా ఉంటారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలియజేశారని అనుకోవచ్చు.
హీరోలెవరూ శుభాకాంక్షలు చెప్పలేదు
అయితే సంధ్య థియేటర్ ఘటన జరిగిన తర్వాత స్టార్ హీరోలంతా బన్నీని దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. గత నెలలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు జరిగితే తెలుగు స్టార్ హీరోలంతా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి హీరో పుట్టినరోజుకు కచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేసే మహేష్ బాబు కూడా బన్నీకి శుభాకాంక్షలు తెలియజేయలేదు. మెగా కుటుంబం నుంచి కూడా ఏ హీరో స్పందించలేదు. రానా, ప్రభాస్ లాంటివారు బన్నీకి ఎంతో సన్నిహితంగా ఉంటారు. వారు కూడా కనీసం ట్వీట్ కూడా చేయలేదు. విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక మాత్రమే స్పందించి విషెస్ చెప్పారు.

పరిశ్రమలో ఒంటరైన అల్లు అర్జున్
పుష్ప2 సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన అల్లు అర్జున్ ను స్టార్ హీరోలు, ఇతర సెలబ్రిటీలు ఎందుకు పట్టించుకోవడంలేదనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. సంధ్య థియేటర్ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు ఇంకా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు. బన్నీ జైలు నుంచి విడుదలవగానే హీరోలంతా స్వాతంత్ర్య సమరయోధుడిని పరామర్శించినట్లుగా వరుసపెట్టి వచ్చి పరామర్శించారు.
దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడటంతో ఎక్కడివారు అక్కడే సైలెంట్ అయ్యారు. జరిగిన తప్పుు ఏమిటో గ్రహించారు. అప్పటి నుంచి దాదాపుగా ఇతర హీరోలందరూ అల్లు అర్జున్ కు దూరంగానే మసులుకుంటున్నారు. భవిష్యత్తులోనైనా అతనితో కలుస్తారా? లేదా? అనేది తెలియదు. ఏదేశమైనప్పటికీ తెలుగు సినీ రంగంలో అల్లు అర్జున్ ఒక్కడే ఒంటరి అయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications