రూ.కోట్లు ఇస్తానన్నా విజయ్ దేవరకొండతో నటించన్న హీరోయిన్
విజయ్ దేవరకొండ రౌడీస్టార్ గా పేరు సంపాదించుకున్నారు. పెళ్లిచూపులుతో మంచి హిట్ అందుకున్న తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయారు. క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఫ్యామిలీస్టార్ చిత్రంతో ముందుకు వచ్చారు విజయ్. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటిరోజు మొదటి ఆట నుంచే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే ఎంపికైంది.
విజయ్ దేవరకొండ సినిమాలు అనగానే కొంత కాంట్రవర్సీలుండటంతోపాటు ట్రోలింగ్ ను ఎదుర్కొంటుంటాడు. తాను నటించే సినిమాల్లో మాత్రం ఒక యాటిట్యూడ్ ను కొనసాగిస్తుంటాడు. దీంతో అతని సినిమాల్లో నటించాలంటే స్టార్ హీరోయిన్ సాయిపల్లవి మాత్రం వెనకడుగు వేస్తుంటుంది. విజయ్ సినిమాల్లో కచ్చితంగా రొమాంటిక్ సన్నివేశాలుంటాయి. నేచురల్ బ్యూటీ గా సాయి పల్లవి దక్షిణాది లోని అన్ని చిత్ర పరిశ్రమల్లో మంచిపేరు సంపాదించుకుంది. నటనతో, నృత్యాలతో అభిమానులను సంపాదించుకుంది. సినిమాలను ఎంపిక చేసుకోవాలంటే ఎంతో ఆచితూచి వ్యవహరిస్తుంటుంది. అటువంటి సాయిపల్లవికి విజయ్ దేవరకొండ రెండు సినిమాల్లో వచ్చిన ఆఫర్లను తిరస్కరించింది.

ముందుగా డియర్ కామ్రేడ్ లో అవకాశం వచ్చింది. తర్వాత ఖుషి సినిమాలో కూడా అవకాశం వచ్చింది. కానీ వీటిని సాయిపల్లవి తిరస్కరించింది. రూ.కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినా నటించనని సూటిగా నిర్మాత, దర్శకులకు తేల్చిచెప్పేసింది. కాంట్రవర్సీలతోపాటు రొమాంటిక్ సన్నివేశాలు విజయ్ సినిమాల్లో కచ్చితంగా ఉంటాయి. దీనివల్ల తన గుడ్ విల్ దెబ్బతింటుందని సాయిపల్లవి భావిస్తోంది. పద్దతిగా, హుందాగా మంచి పాత్రలు చేసే సాయిపల్లవి ఇలాంటి క్యారెక్టర్లను తిరస్కరించడం కూడా మంచిదేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications