మహేష్ బాబు రేర్ రికార్డ్.. ఎవరివల్లా కాదు!
ప్రిన్స్ మహేష్ బాబు చివరిసారిగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా ఫ్లాపైంది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. రాజమౌళికి, మహేష్ బాబుకు ఇద్దరికీ ఇది తొలి పాన్ వరల్డ్ మూవీ కానుంది. భారీ బ్లాక్ బస్టర్ సాధిస్తారంటూ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అడ్వెంచర్ మూవీగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. డాక్టర్ కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రూ.1500 కోట్ల నుంచి రూ.2వేల కోట్ల వరకు సినిమా బడ్జెట్ అవుతుందంటున్నారు.
తన చివరి ఐదు సినిమాలతో మహేష్ బాబు నాన్ పాన్ ఇండియా కేటగిరిలో కొత్త రికార్డ్ సెట్ చేశారు. ఏ హీరో కూడా దీన్ని అందుకోలేకపోయాడు. గుంటూరు కారం సినిమా ఫ్లాపైనప్పటికీ రూ.111.81 కోట్ల షేర్ రాబట్టింది. దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. దీనికి ముందు పరశురాం దర్శకత్వంలో వచ్చిన సర్కారువారి పాట సినిమా కూడా మిక్స్ డ్ టాక్ తో రూ.110.12 కోట్ల షేర్ రాబట్టింది. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రూ.138.78 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

దీనికి ముందుగా వచ్చిన వంశీ పైడిపల్లి చిత్రం మహర్షి బాక్సాఫీస్ హిట్గా నిలిచింది. దీనికి షేర్ రూ.104.58 కోట్లు వచ్చింది. దీనికి ముందు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా కూడా రూ.101 కోట్ల షేర్ సాధించింది. గత ఐదు సినిమాలతో రూ.566.29 కోట్ల షేర్ సాధించాడు. పాన్ ఇండియా సినిమాలు కాపోయినప్పటికీ ఆ రేంజ్ లో షేర్ వసూలుచేయడం అనేది నాన్ పాన్ ఇండియా కేటగిరిలో సరికొత్త రికార్డు అని చెప్పొచ్చు. ఇప్పటివరకు అటువంటి రికార్డు మహేష్ బాబుకే సొంతమైంది.












Click it and Unblock the Notifications