అల్లు అర్జున్ కన్నా ఎక్కువ క్రేజ్ ఉన్న తెలుగు హీరో ఇతడే!
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతూనే ఉందని చెప్పొచ్చు. పాన్ ఇండియా సినిమాగా విడుదలై తెలుగులోకన్నా హిందీలోనే సూపర్ హిట్ అయింది. బాలీవుడ్ ప్రేక్షకులు బాగా ఆదరించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప2పై అంచనాలు భారీగా ఉన్నాయి. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడంతోపాటు టుస్సాడ్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం, జర్మనీలోని ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనేందుకు భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక నటుడు కావడంలాంటి కారణాలన్నీ కలిపి హిందీ బెల్టులో అల్లు అర్జున్ క్రేజ్ ను ఆసాంతం పెంచేశాయి.
పూరీ దర్శకత్వంలో..
పాన్ ఇండియా హీరోగా అటు బాలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో అల్లు అర్జున్ సినిమాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. అయితే అల్లు అర్జున్ కన్నా ప్రస్తుతం మన తెలుగు హీరో ఒకరు ఉత్తరాదిన ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు. అతడెవరో కాదు రామ్ పోతినేని. రామ్ హిందీ డబ్బింగ్ సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అంతేకాదు.. గూగుల్ లో రామ్ గురించే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. రామ్ పోతినేని సినిమాలను చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నామని వారే స్వయంగా చెబుతున్నారు. రామ్ పోతినేని ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ చిత్రం చేస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయి వైపు అడుగులు
ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ మీరో సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ లో పాగా వేయాలని రామ్ ప్రయత్నిస్తున్నాడుకానీ ఎంతవరకు విజయం సాధిస్తారో తెలుసుకోవాలంటే విడుదలయ్యేవరకు వేచిచూడక తప్పదు. మొత్తానికి రామ్ పోతినేని తన స్టామినాను బాలీవుడ్ ప్రేక్షకులకు చూపిస్తూ జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా పాన్ ఇండియా స్థాయికి చేరుకుంటున్నారు. పాన్ ఇండియా అంటే కనీసం ఐదు భాషల్లో సినిమా విడుదలవ్వాలి. ఈ విషయంలో రామ్ ఎంతవరకు విజయం సాధిస్తారో చూద్దాం.












Click it and Unblock the Notifications