పవన్ ‘ఓజీ’ ప్రీమియర్స్‌కు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్..!!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం "ఓజీ ". ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలోనూ ఓజీ మూవీ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రన్ రాజా రన్, సాహో చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ క్రమంలోనే మూవీ నిర్మాతల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కానుండగా 24న రాత్రి 9గంటలకు ప్రీమియర్‌కు అవకాశం ఇచ్చింది. ఆ ప్రకారం టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.800 గా వెల్లడించింది.

అలానే సినిమా విడుదల రోజు (ఈ నెల 25) నుంచి అక్టోబరు 4 వరకు టికెట్ ధరల పెంపునకు సైతం వీలు కల్పించింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. కాగా ఓజీ సినిమా టికెట్ల పెంపునకు అనుమతులిచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఓజీ నిర్మాత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం సినిమా విడుదలైన రోజు నుంచి అక్టోబర్ 4 వరకు (10 రోజుల పాటు) టికెట్ ధరలు పెంచుకోవచ్చు. సింగిల్ స్క్రీన్‌లలో టికెట్‌కు రూ.125, మల్టీప్లెక్స్‌లలో రూ.150 అదనంగా పెంచుకోవడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ నెల 25న తెల్లవారు జామున ఒంటి గంటకు ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ధర రూ.1000గా నిర్ణయించారు. ఈ నిర్ణయంపై నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైనర్స్ ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. సీఎం చంద్రబాబు, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌లకు థాంక్స్ చెప్పింది.
మరోవైపు లేటెస్ట్ గానే పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన పాటను రిలీజ్ చేసింది. వాషి ఓ వాషీ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇందులో పవన్ మరోసారి అదరగొట్టారు. విలన్ ఓమీకి ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. నీ లాంటి ఎలా నేలకు దించాలో నాకు బాగా తెలుసు.. మా తాత చెప్పిన మాట చెబుతాను విను అంటూ డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది.
To all my fellow OG fandom… #WashiYoWashi is for you to experience the OG vibe.
— DVV Entertainment (@DVVMovies) September 19, 2025
Learn the lyrics, bring the energy and let’s turn theatres into a wave of hysteria on Sep 25th 🤗🔥https://t.co/qz1d2qbp4v#OG #TheyCallHimOG pic.twitter.com/xiBdTqjlKM
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనుండగా, సిరి లేళ్ల (నారా రోహిత్ కాబోయే భార్య), అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ వంటి పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications