Thalapathy Vijay: రాజకీయపార్టీ ప్రకటించిన తర్వాత తొలిసారి దళపతి విజయ్ సందేశం.. ఇంట్రెస్టింగ్!!
కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ సినిమాలో తనదైన సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. సినిమాల్లో నటుడుగా తన శక్తిని నేటికీ రుజువు చేసుకుంటూనే ఉన్నాడు. ఇక తాజాగా ఆయన తన సత్తాను రాజకీయాలలో నిరూపించుకోవడానికి నిర్ణయం తీసుకుని రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు. రాజకీయాలను ప్రారంభించి తమిళగ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్ తాను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను అనేది ఇప్పటికే వివరించి చెప్పారు.
2026 ఎన్నికల లక్ష్యంగా తాను తన పార్టీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నానని ఇప్పటికే విజయ్ ప్రకటించారు. రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత తొలిసారిగా విజయ్ నిన్న చెన్నైలోని తన కార్యాలయంలో అభిమానుల క్లబ్ నాయకులతో వర్చువల్ గా మాట్లాడారు. పొలిటికల్ ఎంట్రీ ప్రకటించిన తర్వాత అభిమానులతో హీరో విజయ్ తొలి సమావేశం ఇది.

ఈ సమావేశంలో విజయ్ తన అభిమానులకు కీలక సందేశాన్ని ఇచ్చారు. అవరోధాలు, విమర్శలను చిరునవ్వుతో ఎదుర్కోవాలని, ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని ఆయన తన ఫాన్స్ కు సూచించారు. తాము చేసే సంక్షేమ కార్యక్రమాల ద్వారా గ్రామాలలో పార్టీకి గుర్తింపు తీసుకురావాలని విజయ్ ఆకాంక్షించారు .
2024 లోక్సభ ఎన్నికల తర్వాత అభిమానులంతా పార్టీ కోసం కీలకంగా పని చేయాలని తమ పార్టీ ప్రధాన లక్ష్యం 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు అని విజయ్ పేర్కొన్నారు. పొలిటికల్ ఎంట్రీ తర్వాత తొలి సమావేశాన్ని నిర్వహించిన విజయ్ అటు అభిమానులకు, పార్టీ శ్రేణులకు తనదైన సందేశాన్ని ఇచ్చారు.
రాజకీయ ప్రయాణంలో ఎదురయ్యే విమర్శలను చిరునవ్వుతో ఎదుర్కోవాలని, ఎవరిపైనా పోరాటం చేయాల్సిన అవసరం లేదని, ప్రజా సమస్యల పైన మాత్రమే పోరాటం చేయాలని విజయ్ చెప్పడం విజయ్ విజన్ కు అద్దం పడుతుంది. తన పొలిటికల్ పార్టీ దేనికోసం పనిచేయాలి అన్న క్లారిటీ విజయ్ కు ఉండడంపై అటు ప్రజల్లోనూ, విజయ్ పార్టీపై సానుకూలత కనిపిస్తుంది.
మంచి ఆలోచన ఉన్నవారు, ప్రజలకు సేవ చేయాలనుకునే వారికి రాజకీయాలు సరైన వేదిక అని విజయ్ సరైన వేదికనే ఎంచుకున్నారని చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ఆయన తాజాగా ఇచ్చిన సందేశం చాలా స్పూర్తిదాయకంగా ఉందని కూడా చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications