మహేష్ బాబు సినిమాపై ఆ స్టార్ హీరో టీం కుట్ర?
ఏ ముహూర్తాన ఈ సినిమాను ప్రారంభించారోకానీ అప్పటి నుంచి నిత్యం వివాదాలతో సహవాసం చేయడమే. అసలు సినిమా విడుదలవుతుందా? లేదా? అనే అనుమానంలో ఫ్యాన్స్ ఉంటే ఎలాగోలా షూటింగ్ పూర్తిచేసుకుంది. సంక్రాంతికి విడుదలవుతుందా? లేదా? అనేదే ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న పెద్ద సందేహం.ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. తాజాగా ఓ మై బేబీ పాట విడుదలైంది. సాంగ్ రిలీజ్ అయింది.
పాటల రచయిత రామ జోగయ్యశాస్త్రి ఆ పాటకు ఏం తక్కువయింది అని అభిమానులను ప్రశ్నించాడు. ఆయనపై ట్రోలింగ్ గట్టిగా నడుస్తోంది. దీంతో ఆయన ట్విట్టర్ డీయాక్టివేట్ చేశారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ కాస్త దూకుడు మనిషి. మీ ట్రోల్స్ మాకు దీనితో సమానం అని అర్థం వచ్చేలా.. యానిమల్ సినిమాలోని మంకీ స్టోరీ విజువల్ పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు, రచయిత, నిర్మాత మధ్య గొడవలు రాజుకున్నాయి. వాస్తవానికి ఈ ప్రచారం మొత్తం మహేష్ బాబు అంటే గిట్టని ఓ స్టార్ హీరో ఆధ్వర్యంలో ప్రారంభమైందని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. కొన్నాళ్ల క్రితం సంక్రాంతికి మహేష్ బాబుతో పాటు ఆ హీరో సినిమా కూడా విడుదలైంది. ఆ విషయంలో ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. ఆ సమయంలో ఆ స్టార్ హీరో సినిమా పైచేయి సాధించింది.

అప్పటినుంచి ఆ స్టార్ హీరో మహేష్ బాబును గట్టిగానే టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే గుంటూరు కారం సినిమా విషయంలో సదరు స్టార్ హీరో టీం.. ముందునుంచే ఒక ప్రణాళిక ప్రకారం నెగెటివ్ ప్రచారం చేస్తోందంటున్నారు. అయితే ఈ ట్రాప్ లో గుంటూరు కారం సినిమా నిర్మాతలు, రామజోగ్యలాంటివారు పడుతున్నారు.












Click it and Unblock the Notifications