స్టార్ హీరోను బ్యాన్ చేస్తున్న ఫిల్మ్ ఛాంబర్ ?, నిర్మాతల చర్చలు, షూటింగ్ లో ఉన్న సినిమాలు ?
హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్ కావడంతో ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. దీనిపై పలువురి స్పందనలు నవ్వు తెప్పిస్తుంటే, మరికొన్ని ప్రకటనలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అలాగే కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి చెప్పిన మాట కన్నడ ప్రజలకు నవ్వులు పూయించింది. రేణుకాస్వామి హత్యకేసులో నటుడు దర్శన్ తో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ పవిత్రా గౌడ, వాళ్ల గ్యాంగ్ అరెస్టు అయ్యింది.
హత్య కేసులో హీరో దర్శన్ తో పాటు నిందితుల అరెస్ట్ గురించి కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి స్పందించారు. బెళగావిలో శనివారం విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సతీష్ జారకిహోళి సమాధానమిస్తూ బెంగళూరుకు 550 కి.మీ దూరంలోని బెళగావిలో మేము ఉన్నామని అన్నారు. దీని గురించి ఏమి చెప్పాలి, దర్శన్ కేసు గురించి మాకు ఎలా తెలుస్తుంది, మీరు బెంగుళూరులో ఉన్నవాళ్లను దీని గురించి అడగండి అంటూ మంత్రి సతీష్ జారకిహోళి సమాధానం ఇవ్వడంతో అక్కడున్న వాళ్లు అందరూ నవ్వేశారు.

రేణుకాస్వామిని దర్శన్ తదితరులు చంపేశారని కేసు నమోదు అయ్యింది. రేణుకాస్వామి హత్యకేసుకు సంబంధించి మృతుని కుటుంబాన్ని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ బృందం పరామర్శించింది. చిత్రదుర్గ నగరంలోని తుర్వనూర్ రోడ్డులో ఉన్న మృతుడు రేణుకాస్వామి నివాసాన్ని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సురేష్, ఆయన బృందం సందర్శించి మృతుని తల్లిదండ్రులకు వ్యక్తిగతంగా దనసహాయం చేశారు.
కర్ణాటక ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడితో పాటు, పదాదికారుల ముందు రేణుకాస్వామి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నా కొడుకు ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ విషయం మాకు తెలియజేయవచ్చు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. అయితే చంపాల్సిన అవసరం లేదని రేణుకాస్వామి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సందర్భంగా మృతుడి తల్లిదండ్రులు, భార్యకు ఒక్కొక్కరికి రెండున్నర లక్షల రూపాయలు అంటే మొత్తం రూ. 5 లక్షలు ఫిల్మ్ చాంబర్ పదాదికారులు దజేశారు.
కర్ణాటక ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు సురేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై రేణుకాస్వామి కుటుంబ సభ్యులకు మేము క్షమాపణలు చెప్పామని అన్నారు. హీరో దర్శన్‌ని కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి నిషేధించే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, నిర్మాతలతో చర్చించాలని. పోలీసులు పెట్టే ఛార్జిషీటు చూసి నిర్ణయం తీసుకోవాలని ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు సురేష్ మీడియాకు చెప్పారు. ఈరోజు సినిమా పరిశ్రమను కాపాడుకోవాలని,, కన్నడ చిత్ర పరిశ్రమ నేడు అంతరించిపోయే దశలో ఉందని, దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కర్ణాటక ఫిల్మ్ చాంబర్ పదాదికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications