Mohan Babu: ఆ వార్తల్లో నిజం లేదు.. మంచు ఫ్యామిలీ స్పందన..
ఆస్తుల విషయంలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. మోహన్ బాబు, మనోజ్ పై దాడి చేసినట్లు పలు టీవీ ఛానళ్లు, వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మంచు మనోజ్ గాయాలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన తండ్రి మోహన్ బాబు తనపై దాడి చేసినట్లు పోలీసులు ఫిర్యాదు చేసినట్లు, అలాగే తన భార్య కూడా మోహన్ బాబు దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని ఆదివారం ఉదయం వార్తలు వచ్చాయి. మనోజ్ కూడా తనపై దాడి చేసినట్లు మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరిగింది.
ఆస్తుల కోసమే ఇద్దరు ఘర్షణ పడినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ అంశం టాలీవుడ్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అయితే దీనిపై మంచు ఫ్యామిలీ స్పందించింది. ఈ వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర దాడులు, ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. మంచు మనోజ్ గాయాలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు కథనాలు కొన్ని మీడియా ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయని.. ఇవన్ని అసత్యమని చెప్పింది.

ఆధారాలు లేకుండా ఇష్టమొచ్చినట్లు ప్రసారాలు చెయ్యొద్దని ప్రకటన విడుదల చేసింది. అయితే మంచు ఫ్యామిలీలో ఆస్తులకు సంబంధించి విభేదాలు ఉన్నట్లు తెలిసింది. గతంలో కూడా మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ఆస్తుల విషయంలో గొడవ జరిగినట్లు వార్తలు వచ్చాయి. విష్ణు తన అనుచరులతో తన ఇంటికి వచ్చి దాడి చేశాడని మనోజ్ వీడియో బయట పెట్టాడు. ఆ ఘటన జరిగిన నుంచి ఫ్యామిలీతో మంచు మనోజ్ దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే మనోజ్, మోహన్ బాబు వివాదంపై వారు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇస్తే బాగుటుందని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేస్తున్నారు.
కాగా గత సెప్టెంబర్ లో మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. ఇంట్లో పని చేస్తున్న వ్యక్తే దొంగతనం చేయగా అతన్ని పోలీసులు పట్టుకున్నారు. సదరు వ్యక్తి రూ. 10 లక్షల రూపాయిల డబ్బును దొంగలించి పారిపోయాడు. అతన్ని తెలంగాణ పోలీసులు తిరుపతిలో పట్టుకున్నాడు.












Click it and Unblock the Notifications